ఒలింపిక్స్ నిర్వహణకు ఫ్లోరిడా సిద్ధం
- January 27, 2021మియామీ:ఈ యేడాది ఒలింపిక్స్ నిర్వహణకు టోక్యో వెనక్కి తగ్గితే ఆ క్రీడల నిర్వహణకు తాము సిద్ధమేనని ఫ్లోరిడా చీఫ్ ఫైనాన్షియల్ అధికారి జిమ్మి పాట్రొనిస్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి తెలిపారు. ఈ మేరకు ఐఒసికి ఒక లేఖ రాస్తూ ఒకవేళ జపాన్ ప్రభుత్వం, ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ ఒలింపిక్స్ నిర్వహించలేమని భావిస్తే వాటిని నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
టోక్యో ఒలింపిక్స్ నిర్వహణపై వస్తున్న వదంతుల నేపథ్యంలో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాట్రొనిస్ ఆ ఆన్లైన్ లేఖలో తెలిపారు.
కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఒలింపిక్స్ నిర్వహణ సరైనది కాదని జపాన్ ప్రజల్లో అత్యధికులు భావిస్తున్నట్టు ఒక సర్వే వెల్లడించింది. క్రీడలను రద్దు చేయడం లేదా వాయిదా వేయకుండా తమకు అవకాశం కల్పించాలని ఫ్లోరిడా అధికారులు ఆ లేఖలో వివరించారు. కొవిడ్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటామని, అందుకు అవసరమై వాక్సిన్లనుకూడా సిద్ధం చేస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..