ఒలింపిక్స్ నిర్వహణకు ఫ్లోరిడా సిద్ధం
- January 27, 2021
మియామీ:ఈ యేడాది ఒలింపిక్స్ నిర్వహణకు టోక్యో వెనక్కి తగ్గితే ఆ క్రీడల నిర్వహణకు తాము సిద్ధమేనని ఫ్లోరిడా చీఫ్ ఫైనాన్షియల్ అధికారి జిమ్మి పాట్రొనిస్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి తెలిపారు. ఈ మేరకు ఐఒసికి ఒక లేఖ రాస్తూ ఒకవేళ జపాన్ ప్రభుత్వం, ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ ఒలింపిక్స్ నిర్వహించలేమని భావిస్తే వాటిని నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
టోక్యో ఒలింపిక్స్ నిర్వహణపై వస్తున్న వదంతుల నేపథ్యంలో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాట్రొనిస్ ఆ ఆన్లైన్ లేఖలో తెలిపారు.
కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఒలింపిక్స్ నిర్వహణ సరైనది కాదని జపాన్ ప్రజల్లో అత్యధికులు భావిస్తున్నట్టు ఒక సర్వే వెల్లడించింది. క్రీడలను రద్దు చేయడం లేదా వాయిదా వేయకుండా తమకు అవకాశం కల్పించాలని ఫ్లోరిడా అధికారులు ఆ లేఖలో వివరించారు. కొవిడ్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటామని, అందుకు అవసరమై వాక్సిన్లనుకూడా సిద్ధం చేస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం