గంగూలీ క్షేమం
- January 28, 2021
కలకత్తా: బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు గురువారం సాయంత్రం తెలిపారు. ఈరోజు పరీక్షలు కూడా నిర్వహించామని, ఫలితాలు వచ్చాక తదుపరి చికిత్సపై నిర్ణయం తీసుకుంటామని ఆస్పత్రి సీనియర్ వైద్యులు వెల్లడించారు. ఛాతీలో అసౌకర్యంగా ఉండడంతో బుధవారం ఆయన రెండోసారి ఆస్పత్రిలో చేరిన విషయం విధితమే. యాంజియోగ్రాఫీ చేసే అవకాశం ఉంది. అవసరాన్ని బట్టి మరో స్టెంట్‌ను వేస్తారని కూడా సమాచారం.
జనవరి తొలివారంలో ఆయనకు గుండెనొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరారు. అప్పుడు గుండె రక్తనాళాల్లో మూడుచోట్ల పూడికలుడడంతో సమస్య కనిపించిన చోట వైద్యులు స్టెంట్ అమర్చారు. ఆరోగ్యం బాగానే ఉండడంతో మిగిలిన చోట్ల స్టెంట్ వేయడాన్ని వాయిదా వేశారు. అయితే.. బుధవారం కాస్త తేడాగా అనిపించడంతో రెండోసారి ఆస్పత్రికి వచ్చారు. గురువారం ఆయనకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు మాట్లాడుతూ.. దాదా రాత్రి ప్రశాంతంగా నిద్రపోయారని, ఉదయం లేవగానే తేలికపాటి అల్పాహారం తీసుకున్నారన్నారు. వెస్ట్‌బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే గంగూలీ ఆరోగ్యం పట్ల ఆరా తీశారని, సిపిఎం సీనియర్ నాయకులు అశోక్ భట్టాచార్య ఆస్పత్రికి వచ్చి పరామర్శించారని కుటుంబ సభ్యులు తెలిపారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







