వీసా ఉల్లంఘునలకు మార్చి వరకు గడువిచ్చిన కువైట్
- January 28, 2021
కువైట్: వీసా గడువు ముగిసిన వారికి మరోసారి శుభవార్త అందించింది కువైట్ ప్రభుత్వం. వీసా తేది ముగిసిన పర్యాటకులు, ప్రవాసీయులు దేశం విడిచి వెళ్లే గడువును మరో నెల రోజులు పెంచింది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 2 వరకు పెంచిన గడువు వర్తిస్తుందని అంతర్గత మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. నిజానికి గడువు ముగిసిన వీసా స్టేటస్ మార్చుకునేందుకు లేదా దేశం విడిచి వెళ్లేందుకు జనవరి 31 వరకు క్షమాభిక్ష కాలంగా ప్రకటించింది కువైట్. అయితే..వైరస్ వేరియంట్ ముప్పుతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిన కువైట్ రెండు వారాల పాటు అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలోనే వీసా గడువు ఉల్లంఘునులకు మరో నెల రోజులు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గడువు ముగిసిన వీసాలు మార్చి 2 వరకు అనుమతించేలా నిబంధనలు సడలించింది. కోవిడ్ వ్యాప్తితో గత ఏడాది సరిగ్గా మార్చిలోనే తొలిసారి వీసా తేది ముగిసిన వారికి అదనపు గడువు ఇస్తూ నిర్ణయించింది. అంటే వీసా గడువును దాదాపు ఏడాది పాటు పెంచినట్లైంది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







