మస్కట్:కోవిడ్ ట్రాకింగ్ బ్రాస్లెట్ వాటర్ ప్రూఫ్ కాదు..వాటర్ రెసిస్టెంట్ మాత్రమే
- January 30, 2021
మస్కట్:క్వారంటైన్ లో ఉండే వారిపై నిఘా కొనసాగించేందుకు చేతి మణికట్టుకు బిగించే బ్రాస్లెట్ పై ఒమన్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. బ్రాస్లెట్ నీటితో తడిసినంత మాత్రనా పాడయ్యే అవకాశాలే లేవని, అయితే..నీటిలో వేస్తే మాత్రం చెడిపోయే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. అంటే బ్రాస్లెట్ కేవలం వాటర్ రెసిస్టెంట్ మాత్రమేగానీ, వాటర్ ప్రూఫ్ కాదని గుర్తుంచుకోవాలని వివరించింది. బ్రాస్లెట్ చేతికి ఉన్నప్పుడు స్నానం చేసినా, చేతులు కడుక్కున్నా బ్రాస్లెట్ కు ఏమి కాదు. అయితే..పూర్తిగా నీటిలో వేసి వదిలేస్తే మాత్రం పని చేయకుండా పాడయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







