బహ్రెయిన్ ప్రధాని సల్మాన్ కు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోదీ
- January 30, 2021
మనామా:కరోనా వైరస్ ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఇండియాతో కలిసి పోరాడిన బహ్రెయిన్ కు భారత ప్రధాని నరేంద్రమోదీ ధన్యవాదాలు తెలిపారు. కోవిడ్ పై పోరాటంలో బహ్రెయిన్ తో భాగస్వామ్యం అయినందుకు భారత్ గర్వపడుతోందని బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫాతో అన్నారు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఇరు దేశాల మైత్రి బంధం మరింత బలపడాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు బహ్రెయిన్ కోవిడ్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ ను ఎగుమతి చేసిన భారత్ కు సల్మాన్ ధన్యవాదాలు తెలిపారు. భారత్ నుంచి బహ్రెయిన్ కు 10,800 డోసుల వ్యాక్సిన్ గురువారం రోజునే దిగుమతి అయిన విషయం తెలిసిందే. భారత్ తో భాగస్వామ్యాన్ని తాము కానుకగా భావిస్తున్నామని..ఇండియాతో భాగస్వామ్యం ఇరు దేశాలకు లబ్దిదాయకమని అభిప్రాయపడ్డారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …