APNRTS వారి సహకారంతో స్వస్ధలం చేరిన మృతదేహం

- January 30, 2021 , by Maagulf
APNRTS వారి సహకారంతో స్వస్ధలం చేరిన మృతదేహం

ఏ.పీ:ఏ.పీలోని తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ నగరానికి  చెందిన వాసుపల్లి శ్రీనివాస్ (39) యూఏఈలోని షార్జాలో ప్రమాదవశాత్తు పని చేస్తున్న టాంకర్ నుంచి వెలువడిన విషవాయువులు పీల్చి గత నెల 10వ తేదీన మృతిచెందాడు.అతని మృతదేహాన్ని ఈ రోజు దుబాయ్ నుంచి సామాజిక కార్యకర్త గుండెల్లి నరసింహం సహాయముతో షార్జా నుంచి హైదరాబాద్ విమానాశ్రయానికి చేర్చడం జరిగింది.హైదరాబాద్ నుంచి స్వస్థలం,కాకినాడ వరకు APNRTS వారి సహకారముతో ప్రత్యేక అంబులెన్సు ఏర్పాటు చేసి వారి కుటుంబ సభ్యులకు మృతదేహం చేర్చడం జరిగింది.మృతుని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, ఇటువంటి ఆపత్కాలములో విదేశాలలో నివసిస్తున్న వారికి ఈ విధమైన సహాయకార్యక్రమాలు చేస్తున్న ఏ.పీ ముఖ్యమంత్రి వై.స్.జగన్ మోహన్ రెడ్డికి,APNRTS ఛైర్మన్  వెంకట్  మేడపాటి,APNRTS  డైరెక్టర్ బి.హెచ్ ఇలియాస్ మరియు APNRTS యూఏఈ కో-ఆర్డినేటర్ల,గుండెల్లి నరసింహంకు ధన్యవాదాలు  తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com