TWA వారి సహకారంతో స్వస్ధలం చేరిన మృతదేహం
- January 30, 2021
దోహా:తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ ఖతార్ వారి సహకారంతో మరో గల్ఫ్ కార్మికుడి మృతదేహాన్ని స్వస్థలానికి పంపిచడం జరిగింది.వివరాల్లోకి వెళ్తే...ఖతార్ లోని వక్ర యజ్దాన్ ప్రాంతం, జగిత్యాల జిల్లా కు చెందిన చిన్న రామోజీ రాడా, ఉపాధి నిమిత్తం పది సంవత్సరాలుగా ఖతార్ లో క్లీనర్ గా పనిచేస్తున్నాడు.డ్యూటీ పూర్తి చేసుకొని రూంకి వెళ్లే సమయంలో బస్సు కోసం ఎదురుచూస్తున్న సమయంలో అకస్మాతుగా కుప్ప కూలిపోవడం జరిగింది అక్కడి నుండి హాస్పిటల్ కు తరలించే సమయంలో అంబులెన్సు లోనే గుండెపోటుతో 25.01.2021 తేదీన మృతి చెందాడు.సమాచారం తెలియగానే తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ ఖతార్ అధ్యక్షులు ఖాజా నిజాముద్దీన్ మృతదేహాన్ని సంబంధించిన ఎంబసీ పనులను పూర్తి చేసి 29న మృతదేహాన్ని ఇంటికి పంపించడం జరిగింది.ఖతార్ లోని ధీరజ్ కుమార్(లేబర్ & కమ్యూనిటీ వెల్ఫేర్)కు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.
మృతదేహాన్ని పంపించేందుకు మహమ్మద్ రావూఫ్(కోశాధికారి), నవీద్ దస్తగీర్(కార్యదర్శి), స్వరాజ్ కుమార్(సబ్ కమిటీ మెంబెర్ )సహాయ సహకారాలు అందించడం జరిగింది.హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి డబ్బా గ్రామం కు ప్రభుత్వం ద్వారా ఉచిత అంబులెన్సు కి సహకరించిన భీంరెడ్డి మందకి ప్రత్యేక ధన్యవాదాలు.
తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ దేశాలలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ఐదు లక్షల ఎస్గ్రేషియా ఇచ్చి మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ ఖతార్ అధ్యక్షులు ఖాజా నిజాముద్దీన్ డిమాండ్ చేశారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!