ప్రధాని మోదీతో మాట్లాడిన ఇజ్రాయెల్ పీఎం
- February 01, 2021
జెరూసలేం:ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సోమవారం ప్రధాని మోదీతో ఫోన్ లో మాట్లాడారు. ఇటీవల ఢిల్లీలో తమ దేశ ఎంబసీ వద్ద జరిగిన పేలుడు ఘటన గురించి ప్రస్తావించిన ఆయన.. మా దేశ ప్రతినిధుల రక్షణకు మీ ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ధన్యవాదాలని అన్నారు. భారత, ఇజ్రాయెల్ దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు ఇలాగే కొనసాగుతాయని ఆశిస్తున్నానని తెలిపారు. ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో జరిగిన పేలుడుపై జాతీయ దర్యాప్తు సంస్థతో సహా ఢిల్లీ పోలీసులు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఈ పేలుడుకి అమ్మోనియం నైట్రేట్ వాడినట్టు తేల్చారు. అదే ఆర్డీఎక్స్ వాడి ఉంటె పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని భావిస్తున్నారు. కాగా ఈ ఘటనకు తామే కారణమని జైషే ఉల్ హింద్ సంస్థ ప్రకటించుకుంది. దీనిపై పోలీసులు ఇంకా ఆరా తీస్తున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!