రామజోగయ్య శాస్త్రి కి వేటూరి - వంశీ జాతీయ పురస్కారం...
- February 01, 2021
వంశీ గ్లోబల్ అవార్డ్స్ (అమెరికా- ఇండియా) యునైటెడ్ కింగ్ డమ్, తెలుగు అసోసియేషన్ - లండన్ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ పురస్కార గ్రహీత వేటూరి సుందర రామ్మూర్తి 85వ జయంతిని అంతర్జాలంలో ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా ప్రముఖ సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రికి వేటూరి సుందర రామ్మూర్తి వంశీ జాతీయ సాహితీ పురస్కారం - 2021 ప్రదానం చేశారు..అమెరికా గాన కోకిల శారద ఆకునూరి హూస్టన్ యూఎస్ ఏ రూపకల్పన మరియు నిర్వహణ లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ నటీమణి ప్రజానటి, కళా భారతి, మాజీ పార్లమెంటు సభ్యురాలు డా.జమునా రావు వేటూరికి ఘన నివాళి అర్పిస్తూ, వేటూరి సోదరుని కుమార్తె తన కోడలు అని తెలియజేశారు.శారద ఆకునూరి తన అద్భుతమైన వ్యాఖ్యానంతో, పాటలతో కార్యక్రమం ఆద్యంతమూ రక్తి కట్టించారు. తనకు చిన్నప్పటినుండి వేటూరి గారి పాటలంటే మక్కువ అని, పలు సార్లు వేటూరి పురస్కారాలతో పాల్గొనడం తన అదృష్టం అని అన్నారు. మండలి బుద్ధప్రసాద్, డాక్టర్ సుద్దాల అశోక్ తేజ, సినీ నేపధ్య గాయకులు జి ఆనంద్, వేటూరి రవి ప్రకాష్, ఫణి డొక్కా యూఎస్ఏ, డాక్టర్ వి.పి కిల్లీ యు కే, భువనచంద్ర సినీ గేయ రచయిత, డాక్టర్ వంశీ రామరాజు, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సింగిరెడ్డి శారద యూఎస్ఏ పాల్గొన్నారు.. ఈ సభలో అమెరికా గాయనీ,గాయకులు విశ్వ మోహన్, శ్రీకర్ దర్భ,చంద్రహాస్, సంతోష్ నందిగిరి,ఉషా మాచర్ల, శ్రీనివాస్ దుర్గం, నాగి వేటూరి గీతాలను ఆలపించారు.. ఈ కార్యక్రమాన్ని ట్రైనెట్ లైవ్, టీవీ ఆసియా,తెలుగు యు ఎస్ 1, మన టీవీ, మా గల్ఫ్ మీడియా పార్ట్ నర్స్ గా సహకరించారు.
సుద్దాల అశోకతేజ...
వంశీ రామరాజు దశాబ్దాలుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న మహానుభావుడు.. అనేక లబ్దప్రతిష్టులు తో పాటు అప్పుడే వచ్చిన తనలాంటి కవులను అనేక మందిని అనేక విధాలుగా పరిచయం చేసిన వంశీ సంస్థ ఒక సాంస్కృతిక ముఖద్వారం..ఒక సముద్రాల, ఒక శ్రీశ్రీ, ఒక వేటూరిగారు కవిత్రయం అనుకుంటే అందులో వేటూరి గారు తిక్కన అంతా గొప్పవారు.. సినిమా పాటలతో నాలుగు స్తంభాల ఆట ఆడుకున్న గొప్ప కవి.. శంకరా నాద శరీరా ఒక స్తంభం, దుర్యోధన దుశ్శాసన ఇంకొక స్తంభం, ఆరేసుకోబోయి పారేసుకున్నాను మరొక స్తంభం, కిరాతార్జునీయం నాలుగో స్తంభం.. శ్రీనాథ కవి రచించిన కిరాతార్జునీయం సినిమా పాటకు ఒదిగింప చేయటం విశేషం.. ఇలా నాలుగు స్తంభాల క్రీడ తన ఆఖరి ఊపిరి ఉన్నంతవరకు ఆడిన గొప్ప కవి.. లాలిత్యం, శబ్ద సౌందర్యం, సంప్రదాయం ఆయనకున్న ప్రభుత్వం..
భువనచంద్ర..
వేటూరి గారు రాసిన ప్రతీ పాట ఒక ప్రబంధం.. పాటే ఆయనకు ప్రపంచం..అల్లరి పాటలు కూడా ప్రబంధ మే.. "అమ్మ నీ కమ్మని దెబ్బ" ఈ పాటమొదటి లైను ఎవరూ మార్చలేరని చెప్పారు.. ఆయన రాసిన పాటల మొదటి లైనుకు ఆల్టర్నేటివ్ దొరకదు.. మనకు అన్ని తెలిసిన పదాలే రాస్తారు.ఈ పదం పక్కన ఈ పదం పెడితే ఎలా ఉంటుందో తెలిసిన యోగి ..పింగళితో ప్రారంభమైన నడక వేటూరి కొనసాగించారు.కొత్త కొత్త పదాలకు ఎలా పట్టం కట్టాలి అనేది పింగళిగారు చూపిస్తే వేటూరి గారు ఆయన్ని అనుసరించారు.. వేటూరి ని హిమాలయాల తో పోలుస్తూ తామంతా గులక రాళ్ళుగా ఉటంకించారు.రాబోయే రచయితలకు వేటూరి పాటలు చదవకపోతే ఎలా పదాలు ఉపయోగించాలో తెలియదు అని చెప్పారు.
మండలి బుద్ధప్రసాద్..
వేటూరిసుందర రామ్మూర్తితో తనకు 2009 నుంచి పరిచయమన్నారు.. వేటూరి ప్రభాకర శాస్త్రి తనకు బాగా పరిచయమనీ 500 సంవత్సరాల క్రితం నేల మాడిగల్లో ఉన్న అన్నమాచార్య కీర్తనలు వెలికి తీసిన మహానుభావులు.. వారి సోదరుని కుమారుడు వేటూరి సుందర రామమూర్తి గారు.. వేటూరి 1999 లో ఒక రోజు తనకు ఫోన్ చేసి ఆగిపోయీన సంగీత, సాహిత్య ,వసంతోత్సవాలను పునః ప్రారంభించాలని దానికి తనను అధ్యక్షత వహించమని అడిగారని చెప్పారు..ఆసభకు వచ్చిన బాలసుబ్రహ్మణ్యం గారు తమ ఇద్దరి చేతులు కలిపి మా సుందరయ్య ను చూసుకో మన్నారు..ఆరోజు నుంచి మేమిద్దరం ఒకటిగానే ఉన్నాము..ప్రాచిన భాషగా తమిళాన్ని గుర్తించినప్పుడు తనకు అవార్డు వచ్చింది ఆ తెలుగు వలనే..అలాంటి తెలుగు ను గుర్తించనప్పుడు నాకు ఈ జాతీయ పురస్కారం వద్దు అని వేదిక పై కన్నీరు పెట్టుకుని కేంద్రానికి తిప్పి పంపారు.. వేటూరి వారి స్ఫూర్తి తోనే తెలుగు భాషకై ఉద్యమం మొదలైంది..మన తెలుగు రాజభాష గా వెలుగొందింది.. తెలుగు కు వెలుగులు అందించిన మహా కవి.. మల్లాది, దాశరధి, మహదేవన్ వంటి వారి పుస్తకాలను ప్రచురిస్తూ గాయనిగానే కాక సాహిత్యానికి కూడా సేవ చేస్తున్న గాయని శారద ఆకునూరి ని ప్రశంసించారు రామజోగయ్య శాస్త్రి.
వేటూరి కారణజన్ముడు..ఆయన గురించి విశ్లేషించే శక్తి తనకు లేదన్నారు..గత సంవత్సరం,ఈ సంవత్సరం వేటూరి పేరు మీద అవార్డు తీసుకోవడం తన అదృష్టమని అన్నారు..వారి వెన్నెల తన పై కురవటం తాను అదృష్టజాతకుడు అనుకున్నారు.. సృష్టి లో గొప్ప విషయాలు కనపడవు..పెద్దల ఆశీర్వాదం తనకు లభించింది..అన్నారు.. వేటూరితో తనకు ఎక్కువ జ్ఞాపకాలు లేవని ఒకసారి వరుడు ఆడియో ఫంక్షన్ కు హైదరాబాద్ వచ్చిన వారిని కలుసుకుని రెండు గంటలు మాట్లాడిన విషయాలు పంచుకున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!