హోటళ్లు, సినిమా హాళ్లపై ఆంక్షలు..కోవిడ్ ప్రొటోకాల్ ను ప్రకటించిన దుబాయ్

- February 02, 2021 , by Maagulf
హోటళ్లు, సినిమా హాళ్లపై ఆంక్షలు..కోవిడ్ ప్రొటోకాల్ ను ప్రకటించిన దుబాయ్

దుబాయ్: కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ఎప్పటికప్పుడు పలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న దుబాయ్ ఆరోగ్య శాఖ...ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మరోసారి కోవిడ్ ప్రొటోకాల్ లో సవరణలు చేపట్టింది. ప్రస్తుతం ప్రకటించిన కొత్త నిబంధనలు ఈ నెలాఖరు వరకు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. ఇండోర్ ఈవెంట్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్, పబ్బులు, కేఫ్ లకు సంబంధించి దుబాయ్ ఆరోగ్య శాఖ నిబంధనలు సవరించింది.

- ఇండోర్ ఈవెంట్లు, సినిమా హాళ్లు, స్పోర్ట్స్ ఈవెంట్లతో పాటు ఇతర ఎంటర్టైన్మెంట్ ఈవెంట్లలో వాటి పూర్తి స్థాయి సామర్ధ్యంలో 50 శాతం మందికి మాత్రమే అనుమతి ఉంటుంది.
- హోటల్స్ పూర్తిస్థాయి సామార్ధ్యంలో 70 శాతం మందిని మాత్రమే అనుమతించాలి. ఈ మేరకు బుకింగ్ సౌకర్యాలను కల్పించాలి.
- స్విమ్మింగ్ పూల్, హోటల్స్ లోని ప్రైవేట్ బీచ్ లలోని పూర్తి సామర్ధ్యంలో కేవలం 70 శాతం మందిని మాత్రమే అనుమతించాలి.
- షాపింగ్ మాల్స్ లో కూడా పూర్తిస్థాయి సామర్ధ్యంలో 70 శాతం మందికి మాత్రమే అనుమతి ఉంటుంది.
- రెస్టారెంట్లు, కేఫ్ లను అర్ధరాత్రి ఒంటిగంట వరకు తెరిచి ఉంచొచ్చు. అయితే..ఎలాంటి వాటి ప్రాంగణంలో ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఈవెంట్లకు అనుమతి ఉండదు.
- పబ్బులు, బార్లపై నిషేధం మరికొన్నాళ్లు పొడిగించారు.
ఇక అనుమతించిన రంగాల్లో వినియోదారులు, అతిథులు భౌతిక దూరం పాటించటం, ఫేస్ మాస్కులు ధరించటం వంటి కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిందేనని దుబాయ్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com