భారత్ తో ఎయిర్ బబుల్ ఒప్పందం పొడిగింపు
- February 02, 2021
మస్కట్: అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. అయితే..పలు దేశాలతో కుద్చుర్చుకున్న ఎయిర్ బబుల్ ఒప్పందం మేరకు ఇప్పటికే షెడ్యూల్ అయిన విమాన సర్వీసులను మాత్రం కొనసాగించనున్నట్లు వెల్లడించింది. అలాగే వందేభారత్ మిషన్ ఫ్లైట్ సర్వీసులు కూడా అందుబాటులో ఉంటాయి. అంటే ఒమన్-భారత్ మధ్య వందేభారత్ మిషన్, ఎయిర్ బబుల్ ఒప్పందం మేరకు పరిమిత సంఖ్యలో విమాన సర్వీసులు యథావిధిగా కొనసాగుతాయి. ఒప్పందం ప్రకారం భారత్-ఒమన్ మధ్య ఒమన్ ఎయిర్, సలాం ఎయిర్, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ వంటి నేషనల్ క్యారియర్లు మాత్రమే సర్వీసులు ఆపరేట్ చేసేందుకు అనుమతి ఉంది. ఇక కరోనా వ్యాప్తి నియంత్రణకు పాటించాల్సిన అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు యథావిధిగా కొనసాగుతాయని, ఒమన్ కు చేరుకునే ప్రతి ప్రయాణికుడు తమ ప్రయాణానికి 72 గంటల లోపు చేయించుకున్న పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ ఉంటేనే ఫ్లైట్ ఎక్కేందుకు పర్మిషన్ ఇస్తారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!