హోటళ్లు, సినిమా హాళ్లపై ఆంక్షలు..కోవిడ్ ప్రొటోకాల్ ను ప్రకటించిన దుబాయ్
- February 02, 2021
దుబాయ్: కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ఎప్పటికప్పుడు పలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న దుబాయ్ ఆరోగ్య శాఖ...ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మరోసారి కోవిడ్ ప్రొటోకాల్ లో సవరణలు చేపట్టింది. ప్రస్తుతం ప్రకటించిన కొత్త నిబంధనలు ఈ నెలాఖరు వరకు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. ఇండోర్ ఈవెంట్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్, పబ్బులు, కేఫ్ లకు సంబంధించి దుబాయ్ ఆరోగ్య శాఖ నిబంధనలు సవరించింది.
- ఇండోర్ ఈవెంట్లు, సినిమా హాళ్లు, స్పోర్ట్స్ ఈవెంట్లతో పాటు ఇతర ఎంటర్టైన్మెంట్ ఈవెంట్లలో వాటి పూర్తి స్థాయి సామర్ధ్యంలో 50 శాతం మందికి మాత్రమే అనుమతి ఉంటుంది.
- హోటల్స్ పూర్తిస్థాయి సామార్ధ్యంలో 70 శాతం మందిని మాత్రమే అనుమతించాలి. ఈ మేరకు బుకింగ్ సౌకర్యాలను కల్పించాలి.
- స్విమ్మింగ్ పూల్, హోటల్స్ లోని ప్రైవేట్ బీచ్ లలోని పూర్తి సామర్ధ్యంలో కేవలం 70 శాతం మందిని మాత్రమే అనుమతించాలి.
- షాపింగ్ మాల్స్ లో కూడా పూర్తిస్థాయి సామర్ధ్యంలో 70 శాతం మందికి మాత్రమే అనుమతి ఉంటుంది.
- రెస్టారెంట్లు, కేఫ్ లను అర్ధరాత్రి ఒంటిగంట వరకు తెరిచి ఉంచొచ్చు. అయితే..ఎలాంటి వాటి ప్రాంగణంలో ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఈవెంట్లకు అనుమతి ఉండదు.
- పబ్బులు, బార్లపై నిషేధం మరికొన్నాళ్లు పొడిగించారు.
ఇక అనుమతించిన రంగాల్లో వినియోదారులు, అతిథులు భౌతిక దూరం పాటించటం, ఫేస్ మాస్కులు ధరించటం వంటి కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిందేనని దుబాయ్ ఆరోగ్య శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!