మయన్మార్‌కు బైడెన్ వార్నింగ్‌

- February 02, 2021 , by Maagulf
మయన్మార్‌కు బైడెన్ వార్నింగ్‌

వాషింగ్టన్‌: మయన్మార్‌లో ప్రభుత్వాన్ని సైన్యం ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశంపై ఆంక్షలను విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వార్నింగ్ ఇచ్చారు. వాస్తవానికి ఇటీవల మయన్మార్‌పై ఆంక్షలను ఎత్తివేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆంగ్ సాన్ సూకీ పార్టీ భారీ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సూకీతో పాటు ఇతరులను గృహనిర్బంధం చేసింది. ఐక్యరాజ్యసమితి, బ్రిటన్‌, ఈయూ కూడా ఈ చర్యను ఖండించాయి.

1989 నుంచి 2010 వరకు సుమారు 15 ఏళ్ల పాటు నిర్బంధంలో ఉన్న సూకీ.. సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టాలని ఓ లేఖలో సూకీ కోరారు. సైనిక చర్యలు మళ్లీ దేశాన్ని నియంతృత్వంలోకి తీసుకువెళ్తున్నట్లు ఆమె అన్నారు. మయన్మార్‌లో జరుగుతున్న పరిణామాలపై స్పందించిన బైడెన్‌.. ప్రజల మనోభావాలను సైనిక శక్తితో నొక్కిపెట్టరాదు అని, విశ్వసనీయ ఎన్నికల ఫలితాలను తోసిపుచ్చరాదని అన్నారు. మయన్మార్‌పై ఉన్న ఆంక్షలను ఎత్తివేయడం వల్లే ఆ దేశంలో మళ్లీ ప్రజాస్వామ్యం వెల్లివిరిసిందని, ఈ అంశాలను మరోసారి పరిశీలిస్తామని, ఎక్కడ ప్రజాస్వామ్యంపై దాడి జరిగితే, అక్కడ ఆ దేశానికి అమెరికా మద్దతుగా ఉంటుందని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com