కొత్త అందాలు తో ఆస్కార్ విగ్రహాలు
- February 24, 2016
ప్రపంచం అంతా ఎదురుచూసే 88వ ఆస్కార్ పురస్కారాల ప్రధానోత్సవం జరిగే రోజు అది. ఈ ఏడాది విజేతలకు అభించే ఆస్కార్‌లన్నీ సంసిద్ధం అయ్యారనేది వార్త. కొత్త విషయం ఏమిటంటే, ఈ ఏడాది విజేతలకు కొత్తగా రూపొందింన 'ఆస్కార్ విగ్రహాలు' లభిస్తాయనేదే! ఆస్కార్ విగ్రహాల రూపకల్పన మొట్టమొదటిసారి 1929లో జరిగింది.జార్జ్‌స్టాన్లీ అనే విగ్రహశిల్పి అప్పట్లో వీటికి-కంచు లోహంతో, పైన బంగారురంగు పోతతో, 13.5 అంగుళాల ఎత్తుతో, 8.5 పౌండ్‌ల బరువుతో రూపకల్పన చేశారు. మళ్లీ 1982లో షికాగోలోని ఆర్.ఎస్.ఒవెన్స్ వారు ఆ డిజైన్‌నే ఆధారంగా తీసుకొని, ఆనాటి పద్ధతులలో సిద్ధం చేశారు. అవి సిద్ధం అయికూడా దాదాపు 35 సంవత్సరాలు అయిపోయింది. అందుకే, ఆస్కార్ విగ్రహాలకు ఇప్పుడు మళ్లీ కొత్త అందాలు జత చేయాలని నిర్ణయించారు. ఈసారి ఆస్కార్ ముందుగా 3-డి ప్రింటింగ్ చేయించి, దాని ప్రకారం కొత్త రూపునిచ్చారు. ముందుగా అచ్చం పాతకాలంనాటి ఆస్కార్ విగ్రహంలా ఉండేలా 1600 ఫారెన్‌హీట్ డిగ్రీల ఉష్ణోగ్రతలో ఒక సెరామిక్ షెల్ (పింగాణి డిప్పను) సిద్ధం చేసి, దాని లోపల వాక్స్ (మైనం) పోసి, తర్వాత ఆ వాక్స్‌ను 1800 ఫారెన్‌హీట్ డిగ్రీల దగ్గర కరిగించి, లోపల కరిగిన వేడి కంచు ద్రావకాన్ని పోసి, కొత్త విగ్రహారూపాన్ని సిద్ధం చేశారు. దీనికి ప్యూటర్ అలాయ్ కాస్ట్‌తో 24 క్యారట్ గోల్డ్ ఫినిష్ ఇచ్చారు. ఈ విధంగా మొత్తం 50 విగ్రహాలను తయారుచేసేందుకు న్యూయార్క్‌లోని రాక్ టవెర్న్ ప్రాంతంలో ఉండే పోలిచ్ టాలిక్స్ ఫైన్ ఫౌండ్రీవారికి 3 నెలలు పట్టందని ఆస్కార్ ఆకాడెమీ అధ్యక్షులు షెరిల్ బూన్ ఐసాక్స్ తెలియజేశారు. 1929 నుంచి కిందటేడాది వరకూ మొత్తం 3000 విగ్రహాలను ఆస్కార్ ఉత్సవాలలో విజేతలకు అందజేశారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







