తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు పురోగతి ..
- February 24, 2016
తాత్కాలిక సచివాల నిర్మాణానికి బుధవారం ఎల్అండ్టీ కంపెనీ మొదటి కాంగ్రీట్ పిల్లర్ భూమిలోకి దింపింది. వంద అడుగుల వరకు వెళుతుందనుకున్న పిల్లరు 75 అడుగులకు మించి వెళ్లలేదు. నేల గట్టితనం వలన అంతకన్నా సాధ్య పడలేదని కంపెనీ సిబ్బంది తెలిపారు. ఎనిమిదంతస్తులు నిర్మించేందుకు ఈ లోతు వేస్తే సరిపోతుందని చెప్పారు. మంత్రి నారాయణ బుధవారం పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ఆయన మాట్లాడుతూ తాత్కాలిక సచివాలయ పనులు ప్రాంభమై ఏడు రోజులైందన్నారు. చేస్తున్న పనుల్లో పురోగతి బాగుందన్నారు. 120 రోజుల నిర్మాణ సమయానికి, ఇంకా 133 రోజులు మిగిలున్నయన్నారు. అనుకున్న సమయానికి సచివాలయ నిర్మాణ పనులు పూర్తి అవుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. రాజధానిలో సమస్యలన్నీ ఒక కొలిక్కి వచ్చాయన్నారు. గ్రామ కంఠాల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునే మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేయటం జరిగిందన్నారు. నీరుకొండ, నిడమర్రు ల్యాండు పూలింగ్ కేంద్రాల్లో జరిగిన అవకతవకల గురించి విలేకరులు మంత్రిని అడగగా, దర్యాప్తు జరుగుతుందని, భాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట జడ్పీటీసీ బెజవాడ నరేంద్రబాబు, టీడీపీ నాయకుల నూతక్కి కొండయ్య, వీరాంజనేయులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







