ఉద్యోగ అవకాశాల కోసం ఈ-ప్లాట్ ఫామ్ ప్రారంభించనున్న సౌదీ

- February 03, 2021 , by Maagulf
ఉద్యోగ అవకాశాల కోసం ఈ-ప్లాట్ ఫామ్ ప్రారంభించనున్న సౌదీ

రియాద్:ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు...తమ సామర్ధ్యానికి తగిన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువకుల కోసం సౌదీ అరేబియా ప్రభుత్వం త్వరలోనే ఎలక్ట్రానిక్ ప్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు సౌదీ మంత్రివర్గం ఈ-ప్లాట్ ఫామ్ ఆవిష్కరణకు ఆమోదం తెలిపింది. దీని ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలను పెంచుతూ నిరుద్యోగ శాతాన్ని తగ్గించాలన్నది సౌదీ ప్రభుత్వ లక్ష్యం. కొన్ని సందర్భాల్లో తమకు కావాల్సిన అర్హతలతో ఉద్యోగులు దొరక్క కంపెనీలు ఇబ్బంది పడుతుంటాయి. మరికొన్ని సార్లు తమ సామార్ధ్యానికి తగిన ఉద్యోగం ఎక్కడ పొందవచ్చో గుర్తించటంలో యువకులు సరైన అవగాహన ఉండదు. ఈ రెండు వర్గాలను సమన్వయం చేస్తూ సౌదీ మానవ వనరులు, సోషల్ మీడియా ఆధ్వర్యంలోని ఎలక్ట్రానిక్ ప్లాట్ ఫామ్ ఉపయోగపడనుంది. అయితే..దీన్ని ఎప్పుడు ప్రారంభిస్తారనేది మాత్రం ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు.కానీ, ఎలక్ట్రానిక్ ప్లాట్ ఫామ్ ఏర్పాటైన తర్వాత కింగ్డమ్ పరిధిలో నిరుద్యోగుల శాతాన్ని తగ్గించవచ్చని ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం 11 శాతంగా నిరుద్యోగ రేటును..విజన్ 2030 నాటికి 7 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com