ఫేస్ బుక్ ఫేక్ ఖాతాను తీసేయొచ్చు
- February 05, 2021హైదరాబాద్:ఫేస్బుక్లో ఎవరైనా మన పేరుతో నకిలీ అకౌంట్‌ను సృష్టిస్తే.. దానిని డిలీట్ చేసే ఆప్షన్‌ను కల్పించారు.ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్లు మన పేర నకిలీ అకౌంట్లు సృష్టిస్తూ.. అందులో ‘నాకు అత్యవసర పరిస్థితి ఏర్పడింది.ఆరోగ్య అవసరాల కోసం డబ్బు కావాలి. ఫలానా బ్యాంక్ ఖాతాకు పంపండి’ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ పోస్ట్‌ను చూసిన స్నేహితులు, బంధువులు.. ‘మన వాడు నేరుగా అడగడానికి మొహమాటపడి ఫేస్బుక్ ద్వారా అడుగుతున్నాడు’ అని భావించి డబ్బులు పంపుతున్నారు.ఈ విషయాన్ని మనం గ్రహించేలోపే జరుగాల్సిన మోసం జరిగిపోతుంది. ఇటువంటి మోసాలను అరికట్టేందుకు మన పేరిట సృష్టించిన ఫేక్ అకౌంట్‌ను తొలగించే అవకాశాన్ని ఫేస్బుక్ కల్పించింది.
మిత్రుల అప్రమత్తం
మీ అసలు ఫేస్బుక్ ఖాతాలో ఈ వివరాలను తెలియజేయడం ద్వారా మన బంధువులు, మిత్రులను అప్రమత్తం చేయవచ్చని రాచకొండ సైబర్ క్రైం ఏసీపీ హరినాథ్ తెలిపారు. సైబర్ నేరగాళ్లు కుషాయిగూడ ఏసీపీ శివకుమార్ పేరు మీద ఓ నకిలీ ఖాతాను సృష్టించారు.ఈ ఖాతాలో సైబర్ నేరగాడు ‘నమస్కార్ జీ’ అని పెట్టాడు. ఈ ఖాతాను పరిశీలించిన ఏసీపీ స్నేహితుడు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన ఏసీపీ శివకుమార్.. విషయాన్ని ఫేస్బుక్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వారు సూచించిన విధంగా ఆ నకిలీ ఖాతా ఐడీలో 20 మందితో డిలీట్ పోస్టు అని పెట్టించారు.
నకిలీ ఖాతాను తొలిగించండిలా..
- ఆ నకిలీ ఖాతాలో పైన కుడివైపు మూడు చుక్కలు ఉంటాయి.
- దానిపై క్లిక్‌చేస్తే రిపోర్టు ఆప్షన్ వస్తుంది.
- అందులో దాదాపు 20 మంది ‘ఈ పోస్టును డిలీట్ చేయండి’ అని పెట్టాలి.
- వెంటనే ఫేసుబుక్ ఆ ఖాతాను తొలగించేస్తుంది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు