ఏపీ-తెలంగాణలకు నిరాశ!
- February 25, 2016
కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అంత ఆశాజనకంగా ఏమీ కనిపించలేదు. ప్రయాణీకులకు ఎన్నో తాయిలాలు ప్రకటించినప్పటికీ.. తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టుల విషయంలో మాత్రం మొండిచేయి చూపారు.ఏపీలో విశాఖ రైల్వే జోన్ గురించి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో విశాఖ రైల్వే జోన్ పైన కేంద్రం హామీ ఇచ్చింది. అయితే, ఈ హామీ ఇప్పటి వరకు నెరవేరలేదు. ఈ బడ్జెట్‌లోను విశాఖ రైల్వే జోన్ ఊసు లేదు.కేంద్రమంత్రి ఎలాంటి మాట మాట్లాడలేదు.తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటిఎస్ పొడిగింపు విషయంలో కేంద్రమంత్రి మొండిచేయి చూపారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ డిమాండ్ ఎన్నో ఏళ్ల నుంచి ఉంది. దీని విషయంలో తెలంగాణకు నిరాశ ఎదురైంది.కోనసీమవాసులు చాలా రోజులుగా కోటిపల్లి -నర్సాపూర్ రైల్వే లైన్ కోసం డిమాండ్ చేస్తున్నారు. దీని విషయంలోను ఈ బడ్జెట్లో కేంద్రమంత్రి ప్రస్తావించలేదు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఈ రైల్వే బడ్జెట్ నిరాశనే మిగిల్చిందని చెప్పవచ్చు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







