సెల్ ఫోన్ జమానాలోనూ ఒమన్ లో ల్యాండ్ లైన్ ఫోన్ల హవా
- February 06, 2021
ప్రపంచ వ్యాప్తంగా సెల్ ఫోన్ల హవా నడుస్తున్న ప్రస్తుత జమానాలోనూ ఒమన్ సంప్రాదాయక ల్యాండ్ లైన్ ఫోన్ల వైపే మొగ్గు చూపుతోంది. మొబైల్ శకం మొదలనాటి నుంచి ల్యాండ్ లైన్ ఫోన్ల ప్రాభవం తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే. కానీ, ఒమన్ ప్రజలు మాత్రం సెల్ ఫోన్లతో పాటు ల్యాండ్ లైన్ వైపు కూడా మొగ్గుచూపుతున్నారు. గతేడాది డిసెంబర్ నాటికి ఒమన్ లో ల్యాండ్ లైన్ కనెక్షన్లు 5 లక్షల మార్క్ దాటి 5,95,550 కనెక్షన్లకు చేరుకున్నట్లు జాతీయ గణాంకాలు, సమాచార విభాగం ప్రకటించింది. ఇక ఫిక్స్ డ్ ఇంటర్నెట్ కనెక్షన్లు కూడా 2020లో 7.5 శాతం పెరిగి 5.10 లక్షలకు చేరుకున్నట్లు వివరించింది. అయితే..మొబైల్ వనియోగదారుల సంఖ్య గతేడాది డిసెంబర్ నాటికి 62,76,535కి చేరుకున్నా...అంతకుముందు ఏడాదితో పోలిస్తే వినియోగదారుల సంఖ్య 1.7 శాతం తగ్గటం గమనార్హం.
తాజా వార్తలు
- తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
- హర్మూజ్ పై మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన
- యూఏఈ–భారత్ స్నేహాన్ని ప్రతిబింబిస్తూ విద్యార్థుల ప్రదర్శన
- క్యాన్సర్‌ను జయించి..మారథాన్ రన్నర్‌గా నిలిచిన 40 ఏళ్ల మహిళ
- ప్రతి నేతన్నకు ఉచిత విద్యుత్: మంత్రి సవిత
- బిగ్ అలర్ట్..10 రోజులపాటు తీవ్ర వడగాలులు
- వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసిన ప్రభుత్వం
- సెంట్రల్ మార్కెట్ లో రైడ్స్..మూడు కేసులు నమోదు..!!
- 'లుక్స్ మాక్సింగ్' ప్రయత్నించారా? సోషల్ మీడియా ట్రెండ్ పై హెచ్చరిస్తున్న డాక్టర్లు..!!
- బహ్రెయిన్ లో ఫుడ్ స్కామ్.. నిందితులకు జైలుశిక్ష, ఫైన్, బహిష్కరణ..!!









