కరోనా వ్యాక్సిన్:ప్రపంచంలో భారత్ మూడో స్థానం!
- February 07, 2021
న్యూఢిల్లీ: భారత దేశంలో ఇప్పటివరకూ 57,75,322 మంది ఆరోగ్య, ఫ్రంట్‌లైన్ కార్మికులకు కరోనా వ్యాక్సిన్ వేశారు.ప్రపంచంలో ఎక్కువమందికి కరోనా వ్యాక్సిన్ వేసిన దేశాల్లో అమెరికా, బ్రిటన్ తరువాత మూడో స్థానంలో భారత్ ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. దేశంలో ఇప్పటిదాకా 53,04,546 మంది వైద్య సిబ్బంది, 4,70,776 మంది ఫ్రంట్‌లైన్ కార్మికులకు టీకా వేసినట్టు తెలిపింది. అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్‌లో 6,73,542 మంది, ఆ తర్వాత మహారాష్ట్రలో 4,73,480 మంది, రాజస్థాన్‌లో 4,59,652 మందికి కరోనా టీకాలు వేసినట్టు తెలిపింది. ఒక్కో రాష్ట్రంలో రెండేసి లక్షల మంది చొప్పున 12 రాష్ట్రాల్లో వ్యాక్సిన్లు తీసుకున్నట్టు పేర్కొంది. వ్యాక్సినేషన్ శాతాన్ని పెంచాల్సిందిగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జనవరి 16న ప్రారంభమైంది. అప్పుడు తొలి డోసు తీసుకున్న వారు ఈ నెల 13న రెండో డోసు తీసుకోనున్నారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి అభివఅద్ధి చెందాలంటే 28 రోజుల వ్యవధిలో రెండో డోసు తీసుకోవడం తప్పనిసరి.
తాజా వార్తలు
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం







