శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు కలకలం!
- February 08, 2021
హైదరాబాద్:శంషాబాద్ విమానాశ్రయంలోని డెకథ్లాన్ స్పోర్ట్స్ రూమ్లో బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపుతోంది. స్టోర్లో బాంబ్ పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి నుంచి సోమవారం బెదిరింపు కాల్ వచ్చింది. రిమోట్ బాంబ్ పెట్టినట్లు బెదిరించిన అగంతకుడు.. కోటి రూపాయలు ఇవ్వాలని లేకుంటే రిమోట్తో బాంబును పేల్చేస్తామని హెచ్చరించాడు. దీంతో తీవ్ర భయభ్రాంతుకలకు గురైన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. బాంబు స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు. విస్తృత తనిఖీల తర్వాత బాంబు లేదని పోలీసులు తేల్చి చెప్పడంతో స్టోర్ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. అనంతరం ఫోన్ కాల్ ఆధారంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







