ఫేస్‌బుక్‌ ఆకతాయికి రెండేళ్ల జైలు శిక్ష,జరిమానా

- February 08, 2021 , by Maagulf
ఫేస్‌బుక్‌ ఆకతాయికి రెండేళ్ల జైలు శిక్ష,జరిమానా

హైదరాబాద్:ఫేస్‌బుక్‌లో పరిచయమైన అమ్మాయిని వేధించిన ఆకతాయికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు చెప్పింది. సోషల్ మీడియాలో ఏ.పీకి చెందిన జంబాడ లక్ష్మీ వరప్రసాద్‌కు ఫేస్‌బుక్‌లో హైదరాబాద్ కు చెందిన  ఓ అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయికి ఫేస్‌బుక్‌లో రవి కృష్ణ (స్టార్ మా టీవీలో సీరియల్ యాక్టర్) అని ఎఫ్‌బి ప్రొఫైల్ నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది.అది నిజమే అనుకుని ఆ అమ్మాయి నమ్మింది.

ప్రతిరోజు  వరప్రసాద్ ఛాట్ చేస్తూ ఉండేవాడు.ఈ క్రమంలో కొన్ని రోజుల తరువాత ఆ అమ్మాయిని లైంగిక వేధింపులకు గురి చేశాడు.అసభ్యకర మెస్సేజ్‌లు పెట్టి డబ్బులు డిమాండ్ చేశాడు.

తాను అడిగినన్ని డబ్బులు ఇవ్వకపోతే తమ ఇద్దరి మధ్య జరిగిన కామెంట్లు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.వరప్రసాద్ వేధింపులు భరించలేక సైబర్ క్రైమ్ పోలీసులకు బాధిత యువతి ఫిర్యాదు చేసింది.యువతి ఫిర్యాదుతో వరప్రసాద్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. వరప్రసాద్ పై ఛార్జిషీట్ దాఖలు చేసిన అనంతరం పోలీసులు విచారణ జరిపారు. తగిన సాక్ష్యాధారాలను సేకరించి కోర్టుకు సమర్పించారు. వరప్రసాద్ చేసిన నేరం రుజువు కావడంతో అతడికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ రంగారెడ్డి కోర్టు తీర్పు చెప్పింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com