గల్ఫ్ వెళ్తున్నారా? జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్న కమీషనర్ మహేష్ భగవత్

- February 09, 2021 , by Maagulf
గల్ఫ్ వెళ్తున్నారా? జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్న కమీషనర్ మహేష్ భగవత్

హైదరాబాద్:గల్ఫ్ దేశాలకు తెలంగాణ,ఏపీ రాష్ట్రాల నుండి చాలా మంది పని కోసం వెళ్తున్నారని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. గ్రామాల్లో కొంతమంది ఏజెన్సీలుగా ఏర్పడి మహిళలను ఇతర దేశాలకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు.విజిట్ వీసా మీద ఇతర దేశాలకు పంపిస్తారు..విజిట్ వీసా అయిపోయిన తర్వాత వారిని జైల్లో పెట్టి అనంతరం వారిని విడిపించి వ్యబిచార గృహాలకు తరలిస్తున్నారని తెలిపారు.మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఖాదర్ బి అనే మహిళను ఒమన్ దేశానికి వెళ్ళడానికి సిద్ధం చేశారు.

ఒమన్ దేశానికి వెళ్లాలంటే ఏజెంట్ తో ఒకరు గడపాలని షరతులు పెట్టారు..దింతో అనుమానం వచ్చిన మహిళ పోలీసులకు సమాచారం అందించింది.. వారిపై దాడి చేసి ముఠా ను అరెస్ట్ చేసాం..ఈ కేసులో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసాం..మరో ముగ్గురు నిందితులు పరారీ లో ఉన్నారు..నిందితుల వద్ద నుండి 40 ఇండియా పాస్ పోర్టులు, 4 మొబైల్ ఫోన్స్, 6 వేల నగదు స్వాధీనం చేసుకున్నాము.

నిందితులందరు కడప,హైదరాబాద్ కు చెందిన వారు.తెలంగాణ,ఏపీ  రాష్టాల నుండి మహిళల ను ట్రాప్ చేసి వారికి డబ్బు ఆశ చూపించి ఇతర దేశాల్లో ఉండే వారికి అమ్ముతారు. అరబ్ దేశాలకు ఎక్కువగా మహిళలు అమ్ముతారు..ఇతర దేశాలకు పంపిస్తామని ఏజెంట్లు ఎవ్వరైనా వచ్చి ఇబ్బందులు పెడితే మాకు సమాచారం అందించాలని మహేష్ భగవత్ వ్యాఖ్యానించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com