సౌదీలో న్యాయ సంస్కరణలు..ఈ ఏడాదిలో 4 కీలక చట్ట సవరణలు

- February 09, 2021 , by Maagulf
సౌదీలో న్యాయ సంస్కరణలు..ఈ ఏడాదిలో 4 కీలక చట్ట సవరణలు

సౌదీ:న్యాయ వ్యవస్థలో సంస్కరణలే లక్ష్యంగా ఈ ఏడాది కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రకటించారు. నాలుగు కీలకమైన చట్టాలను సవరించనున్నట్లు ఆయన వెల్లడించారు. పర్సనల్ స్టేటస్ లా, సివిల్ ట్రాన్సాక్షన్ లాతో పాటు విచక్షణ మేరకు తీర్పులు ఇచ్చే పీనల్ కోడ్, ఎవిడెన్స్ చట్టాల్లో కీలక సవరణలు చేయనున్నట్లు తెలిపారు. ఈ సంస్కరణలు న్యాయ వ్యవస్థను మరింత పటిష్టపరుస్తాయని, న్యాయ సంస్థల సామర్థ్యం, పర్యవేక్షణ విధానాల విశ్వసనీయతను పెంచుతుందని క్రౌన్ ప్రిన్స్ అభిప్రాయపడ్డారు. 

--జయ(మాగల్ఫ్ ప్రతినిథి,సౌదీ అరేబియా)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com