షార్జాలో ప్రభుత్వ, ప్రైవేట్ సిబ్బందికి ఇక పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి
- February 09, 2021
షార్జా:యూఏఈలోని మరో ఎమిరేట్ ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని సిబ్బందికి పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి చేసింది. కోవిడ్ 19ని అడ్డుకునేందుకు యూఏఈ ఫెడరల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఇప్పటికే పలు ఎమిరేట్స్ లు తమ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి వారం పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఇప్పుడు షార్జా కూడా అదే బాటలో పయనిస్తోంది.ఎమిరేట్ పరిధిలోని గవర్నమెంట్, సెమీ గవర్నమెంట్ రంగంలోని విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో పాటు...ప్రైవేట్లోని కొన్ని సెక్టార్ స్టాఫ్ ఖచ్చితంగా పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఏడు రోజులకు ఒకసారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని, రెస్టారెంట్లు, కేఫ్ లు, సెలూన్ల వంటి ప్రైవేట్ రంగాల్లోని సిబ్బంది రెండు వారాలకు ఓ సారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని షార్జా పాలనా యంత్రాంగం ఆదేశించింది.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,షార్జా)
తాజా వార్తలు
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!
- సోమాలిలాండ్ గుర్తింపును తిరస్కరించిన కువైట్..!!
- యూఏఈ-భారత్ మధ్య విమాన ఛార్జీలు తగ్గుతాయా?
- సౌదీ అరేబియాలో 13,241 మందిపై బహిష్కరణ వేటు..!!
- లుసైల్ బౌలేవార్డ్ ‘అల్-మజ్లిస్’ డిసెంబర్ 31 టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్లో 17.3 శాతం పెరిగిన రియల్ ఇండెక్స్..!!
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు







