షార్జాలోని ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం
- February 10, 2021
షార్జా:ఇటీవలి కాలంలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో షార్జా పాలన యంత్రాంగం మరిన్ని ముందస్తు జాగ్రత్తలు చేపడుతోంది. యూఏఈ ఫెడరల్ గవర్నమెంట్ నిర్ణయాలకు అనుగుణంగా ఇప్పటికే రెస్టారెంట్లు, కేఫ్ లు, థియేటర్లు, షాపింగ్ మాల్స్ లో కస్టమర్ల సంఖ్యపై పరిమితులు విధించారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. ఎమిరాతి పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ప్రతి వారం తప్పనిసరిగా పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని షార్జా అధికారులు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నమెంట్ ఆఫీసులలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు సిబ్బందిలో అవకాశం ఉన్న వాళ్లంతా ఇంటి నుంచే పని చేసుకునేలా వెసులుబాటు కలిపించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా డిపార్ట్మెంట్ల ఉన్నతాధికారులు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలును పర్యవేక్షించనున్నారు. ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ కుదరని డిపార్ట్మెంట్లలో షిఫ్ట్ ల వారీగా ఉద్యోగులు విధుల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి షిఫ్ట్ లో ఆఫీసుకు హజరయ్యే ఉద్యోగుల సంఖ్య 50 శాతానికి మించకూడదని సూచించింది. అంతేకాదు..ప్రతి ఉద్యోగి డెస్క్ ఇతర ఉద్యోగికి రెండు మీటర్ల దూరంలో ఉండేలా ఏర్పాటు చేయాలని షార్జా పాలనా యంత్రాంగం ఆదేశించింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు







