మహాసముద్రం విడుదల తేదీ ఖరారు
- February 10, 2021
తెలుగు చిత్ర సీమలో మల్టీస్టారర్ సినిమాగా తెరకెక్కుతున్న చిత్రాల్లో మహాసముద్రం కూడా ఒకటి. ఈ సినిమాలో యువహీరోలు శర్వానంద్, సిద్దార్థలు హీరోలుగా చేస్తున్నారు.తెలుగు సినిమాలకు దూరమైన సిద్దార్థ చాలా కాలం తరువాత మళ్లీ ఈ సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు అజయ్ భూపతి యాక్షన్ రొమాంటిక్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో అను ఇమాన్యుయేల్, అదితి రావ్ హీరోయిన్లుగా చేస్తున్నారు. ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లు ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. అయితే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందని తెలుగు సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్ట్ 19న ఈ సినిమా విడుదల కానుందంట. దర్శకుడు అజయ్ భూపతి ఆర్ఎక్స్100 తరువాత దాదాపు రెండు సంవత్సరాల తరువాత మరో అద్భుత ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇదిలా ఉంటే హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. మరి తన సినిమాలతో శర్వానంద్ ప్రేక్షకులను ఎంతలా అలరిస్తారో వేచి చూడాలి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు