అత్యవసరమైతే తప్ప విదేశ ప్రయాణాలు వద్దు..ఒమన్ సుప్రీం కమిటీ
- February 11, 2021
మస్కట్:ఒమన్ పౌరులు, ప్రవాసీయులు అత్యవసరమైతే తప్ప దేశం విడిచి వెళ్లొద్దని సుప్రీం కమిటీ సూచించింది. మరీ ముఖ్యంగా కోవిడ్ ప్రభావిత దేశాలకు ప్రయాణాలను పూర్తిగా మానుకోవాలని కోరింది. అంతేకాదు..కోవిడ్ నియంత్రణకు ఇప్పటికే పలు దేశాలు విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు విధించటం..ట్రావెల్ ప్రోటోకాల్ మార్గనిర్దేశకాలను ప్రకటించిన నేపథ్యంలో విదేశాలకు వెళ్తే అక్కడే చిక్కుకుపోయే అవకాశాలు కూడా ఉన్నాయని హెచ్చరించింది. చివరికి అధికారిక పర్యటనలను కూడా వీలైనంత పరిమిత సంఖ్యకు కుదించాలని నిర్ణయించింది. ఒమన్లో కోవిడ్ ను అరికట్టేందుకు ఏర్పాటైన సుప్రీం కమిటీ..ఎప్పటికప్పుడు సుల్తానేట్లోని తాజా పరిస్థితులను సమీక్షిస్తున్నట్లు వెల్లడించింది. దేశీయంగా, అంతర్జాతీయంగా కోవిడ్ ప్రభావాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించుకొని అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. సుల్తానేట్ పరిధిలో కోవిడ్ వ్యాప్తి నియంత్రణ చర్యలకు విఘాతం కలిగించేలా వ్యవహరించిన వ్యక్తులు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని, అదే సమయంలో ఆయా వ్యక్తులు, సంస్థల వివరాలు, ఫోటోలు, పేర్లతో సహా మీడియాలో పబ్లిష్ చేస్తామని హెచ్చరించింది. ఇదిలాఉంటే కోవిడ్ సంక్షోభం దేశీయంగా చిన్న, మధ్య తరహా పరిశ్రామిక రంగాలపై ప్రభావం చూపకుండా అవసరమైన వెసులుబాటు చర్యలు కొనసాగిస్తునట్లు సుప్రీం కమిటీ వెల్లడించింది. చిన్న, మధ్యా తరహా కంపెనీలకు లోన్ల వాయిదాల చెల్లింపును పోస్ట్ పోన్ చేస్తున్నట్లు కమిటీ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష