గోపీచంద్ దర్శకత్వంలో బాలయ్య సినిమా

- February 11, 2021 , by Maagulf
గోపీచంద్ దర్శకత్వంలో బాలయ్య సినిమా

హైదరాబాద్:నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ ఒక హీరోయిన్‌గా నటిస్తున్నారు.ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 28న ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

ఈ సినిమా తరవాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటించబోతున్నారు.ప్రముఖ నిర్మాణ సంస్థ‌ మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాని నిర్మించనుంది.గోపీచంద్ మలినేని ‘క్రాక్’ సినిమాతో ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.మాస్ మహారాజా రవితేజతో హ్యాట్రిక్ కొట్టారు. మరి గోపీచంద్‌ తన శైలి మాస్‌ అంశాలతో బాలకృష్ణ కోసం ఎలాంటి కథను సిద్ధం చేశాడో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com