వీకెండ్ లో పెరగనున్న చలి తీవ్రత..ఖతార్ వాతావరణ శాఖ వెల్లడి
- February 11, 2021
దోహా:ఖతార్ లో రానున్న రెండ్రోజులు చలి తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాత్రి వేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతాయని, రాత్రిళ్లు శీతల వాతావరణం ఉండే అవకాశాలే ఎక్కువని అంచనాగా చెప్పుకోచ్చింది. అయితే పగటి వేళల్లో మాత్రం మేఘాలతో కూడిన వాతావరణం ఉంటుందని, గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా పరిమితంగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. శుక్రవారం గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగాను, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ గాను నమోదవుతాయన్నారు. దుమ్ముతో కూడిన గాలి తీవ్రత కూడా ఉంటుందని, గాలి తీవ్రతకు వాయువ్య దిశలో సముద్రంలో ఆటుపోటులు కనిపిస్తాయన్నారు. శుక్రవారం సముద్ర ఆలలు సాధారణ రోజుల కంటే 8 అడుగులు ఎక్కువగా వస్తాయని, శనివారం రోజున అలలు 6 అడుగుల ఎత్తులో వస్తాయన్నారు. ఈ వారంతంలో దృశ్య సంభావ్యత 4 కిలో మీటర్లుగా ఉండొచ్చని వివరించారు.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







