హైదరాబాద్ నుంచి మాలె, మాల్దీవులకు నేరుగా విమాన సర్వీసు
- February 11, 2021
- హైదరాబాద్ నుంచి మాలెకు విమాన సర్వీసు ప్రారంభించిన గో ఎయిర్
- వారానికి 4 రోజులు హైదరాబాద్-మాలె మధ్య విమాన సర్వీసు
హైదరాబాద్: జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (GHIAL) ఈ రోజు హైదరాబాద్ నుండి మాల్దీవులలోని మాలేకు గో ఎయిర్ విమాన సర్వీసును ప్రారంభించింది. గోఎయిర్ విమానం 11. 40 గంటలకు హైదరాబాద్ నుండి మాలేకు బయలుదేరింది. గో ఎయిర్ ఈ విమానం ద్వారా అంతర్జాతీయ సర్వీసులకు ఈ-బోర్డింగ్‌ను ఉపయోగించుకోవడం ప్రారంభించింది. జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన సీనియర్ అధికారులు, గో ఎయిర్ అధికారులతో పాటు, ఇతర విమానాశ్రయ భాగస్వాములు టెర్మినల్ వద్ద ప్రయాణీకులు, సిబ్బందికి వీడ్కోలు పలికారు.

గో ఎయిర్ ఫ్లైట్ G8 1533 ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయం నుండి బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు మాల్దీవులలోని వెలానా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో G8 4033 సర్వీసు మధ్యాహ్నం 2.30 గంటలకు మాలే నుండి బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, మాలే మధ్య సోమవారం, మంగళవారం, గురువారం, శనివారం - వారానికి నాలుగు సార్లు విమానాలు నడుస్తాయి.

జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సీఇఓ ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ “హైదరాబాద్, మాలేలను కలిపే ఈ నూతన సర్వీసు కోసం ప్రయాణికులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్నారు. సాహస ప్రియులు, ప్రకృతి ప్రేమికులు, సెలవులకు వెళ్ళేవారు హైదరాబాద్ విమానాశ్రయం నుండి ప్రారంభమయ్యే ఈ రెండున్నర గంటల విమాన ప్రయాణాన్ని ఎంతో ఇష్టపడతారు. ఈ సర్వీసు చాలా కాలం ఉంటుందని ఆశిస్తున్నాము. వారానికి నాలుగు సార్లతో ప్రారంభమైన ఈ సర్వీసు, ఈ రూటుకు ఉన్న డిమాండ్‌ను సూచిస్తుంది. అంతర్జాతీయ ప్రయాణానికి ఆంక్షలు ఎత్తివేసిన తరువాత జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అన్ని అంతర్జాతీయ గమ్యస్థానాలకు సర్వీసులను ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది’’ అన్నారు.
గోయిర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కౌశిక్ ఖోనా, “హైదరాబాదీల కోసం గోఎయిర్ ఈ ప్రత్యేక సర్వీసును ప్రారంభిస్తోంది. మాలెకు వెళ్లే ప్రయాణికులకు ఈ సర్వీసు ద్వారా ఇప్పుడు మరో ప్రత్యామ్నాయం లభించింది. తద్వారా వారి ప్రయాణ అనుభవం మరింత ఆనందదాయకంగా, సౌకర్యవంతంగా మారుతుంది. మాకు ఈ అవకాశం కల్పించిన జీఎంఆర్ విమానాశ్రయాలు, సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ), బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బిసిఎఎస్), కస్టమ్స్ - రెవెన్యూ విభాగం, ఇండియన్ ఆయిల్, మా వ్యూహాత్మక భాగస్వాములకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.’’ అన్నారు.
హైదరాబాద్ దక్షిణ, మధ్య భారతదేశానికి ప్రవేశ ద్వారం లాంటిది. అలాగే చాలా మంది ఇష్టపడే అతిపెద్ద రవాణా కేంద్రం. ఇది సమీప నగరాలైన విజయవాడ, విశాఖపట్నం, నాగ్‌పూర్, భువనేశ్వర్, రాజమండ్రి, భోపాల్, తిరుపతి నుండి వచ్చే ప్రయాణీకులకు అనుకూలమైన విమానాశ్రయం. ఇటీవల, ప్రయాణీకుల కోరిక మేరకు, హైదరాబాద్ విమానాశ్రయం చికాగోకు నాన్ స్టాప్ ఫ్లైట్ సర్వీసును కూడా ప్రారంభించింది.

గోఎయిర్ను 'స్మార్ట్ పీపుల్స్ ఎయిర్‌లైన్' గా ఉంచారు. గోఎయిర్ తన వ్యాపార నమూనాను 'సమయస్ఫూర్తి, స్థోమత మరియు సౌలభ్యం' అన్న మూడు-స్థాయిల సూత్రంపై అమలు చేస్తుంది. ఇటీవల గోఎయిర్ తమ ప్యాసింజర్ సర్వీస్ సిస్టమ్ కోసం ఆటోమేటెడ్ ఏవియేషన్ మరియు ట్రావెల్-సంబంధిత సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ యొక్క ప్రముఖ టెక్నాలజీ ప్రొవైడర్ నావిటెయిర్తో భాగస్వామ్యం చేసుకుంది. ఇలాంటి సాంకేతిక పరిష్కారాల ద్వారా, గోఎయిర్ అత్యుత్తమ ప్రక్రియా సామర్థ్యాన్ని సంపాదించుకుంది.
వాటర్ స్పోర్ట్స్ ప్రియులు, అడ్వెంచర్ స్పోర్ట్స్ ప్రేమికులు, హనీమూన్‌కు వెళ్లే జంటలకు మాల్దీవులు అత్యంత ఇష్టపడే ప్రదేశం. ఈ గందరగోళపు ప్రపంచం నుంచి తప్పించుకొనేందుకు ఈ భూతల స్వర్గం చాలా అనువైన టూరిస్టు కేంద్రం. మాలేలోని కృత్రిమ బీచ్‌లో కయాకింగ్, వేక్బోర్డింగ్, స్కూబా డైవింగ్, కాటమరాన్ సెయిలింగ్ వంటి ఆకర్షణీయమైన జల క్రీడా కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







