జైలు నుండి ఇంటికి చేరిన సౌదీ హక్కుల కార్యకర్త లౌజైన్
- February 11, 2021
రియాద్: మూడేళ్ల నిర్బంధం అనంతరం మహిళా హక్కుల కార్యకర్త లౌజన్ అల్ హథ్లౌల్ (31)ను సౌదీ అరేబియా అధికారులు విడుదల చేశారు. సౌదీ అరేబియా లో మహిళలకూ డ్రైవింగ్ చేసే అవకాశం కల్పిస్తూ.. సౌదీ అరేబియా చారిత్రక నిర్ణయం తీసుకున్న కొన్ని వారాల ముందే ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. 2018 మేలో జైలుకు తరలించారు. ఆమెతో మరికొందరినీ అరెస్ట్ చేశారు.
అయితే, లౌజైన్ విడుదల కోసం అప్పట్నుంచీ ఆమె కుటుంబ సభ్యులు పోరాడుతున్నారు. ప్రపంచం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అమెరికా సౌదీపై ఒత్తిడి పెంచింది.అంతర్జాతీయంగా ఆ దేశంపై ఒత్తిడి ఎక్కువైంది. దీంతో మూడేళ్ల తర్వాత గురువారం ఆమెను సౌదీ ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేసింది.
ఈ విషయాన్ని ఆమె సోదరి లీనా అల్ హత్లౌల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 1001 రోజుల తర్వాత లౌజైన్ ఇల్లు చేరిందన్నారు.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







