సౌదీ అరేబియాలో మహిళలకు సైనికోద్యోగాలు
- February 12, 2021
రియాద్:సౌదీ మహిళలకు తొలి సోల్జర్ (లాన్స్ కార్పొరల్) ఉద్యోగాల్ని కల్పిస్తున్నారు. రియాద్ లోని కింగ్ ఫహద్ సెక్యూరిటీ కాలేజీలో ఈ ఉద్యోగాల కల్పన చేపడుతున్నారు. ఉద్యోగాల అడ్మిషన్ మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియల్ని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, మిలిటరీ ఎఫైర్స్ - జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సెంట్రల్ అడ్మిషన్ ప్రకటించడం జరిగింది. ఫిబ్రవరి 13 నుంచి ఫిబ్రవరి 18 వరకు దరఖాస్తులు అబ్షెర్ ఎంప్లాయిమెంట్ వేదికపై స్వీకరించబడతాయి. కింగ్ ఫహాద్ సెక్యూరిటీ కాలేజీ, ఎడ్యుకేషన్ / మిలిటరీ ఇనిస్టిట్యూట్. ఇది ఈస్టర్న్ రియాద్ లో వుంది. ఈ కాలేజీలో స్పెషలైజ్డ్ ఎడ్యకేషనల్, ట్రైనింగ్ మరియు రీసెర్చి సర్వీసులను మిలిటరీ ఆఫ్ ఇంటీరియర్ ఉద్యోగుల కోసం అందిస్తుంటారు. గవర్నమెంట్ సెక్టార్లు వంటివాటికి కూడా సేవలందించడం జరుగుతుంది. ఈ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పొందినవారు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, పబ్లిక్ సెక్యూరిటీ, సివిల్ డిఫెన్స్, డ్రగ్ కంట్రోల్ వంటి విభాగాల్లో ఉద్యోగాలకు అర్హులు.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్‌ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







