ఆరోగ్యాన్నిచ్చే పండ్లలో ఆల్ బుకార పండు ఒకటి !
- February 25, 2016
ప్రకృతిలో ఆరోగ్యాన్నిచ్చే పండ్లలో ఒకటి ఆల్ బుకార పండు.. చాలామంది వీటిని అంతగా పట్టించుకోరు గానీ ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిల్లో కేలరీలు చాలా తక్కువ. సాధారణంగా పండ్లు తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజు స్థాయిలు పెరుగుతుంటాయి. కానీ వీటితో అలాంటి ప్రమాదమేమీ ఉండదు. ఎందుకంటే వీటి 'గ్త్లసిమిక్ ఇండెక్స్' చాలా తక్కువ. ఆల్బుకారా పండ్లలో విటమిన్ సి దండిగా ఉంటుంది. అందువల్ల ఇవి రోగనిరోధకశక్తిని పెంచి, త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది.
పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు.
ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది. మనం తిన్న ఆహారం నుంచి శరీరం ఇనుమును బాగా గ్రహించేలా కూడా చేస్తాయి. ఇక వీటిల్లోని ప్రోసైయానిడిన్, నియోక్లోరోజెనిక్‌యాసిడ్, క్యూర్సెటిన్ వంటి ఫెనోలిక్ రసాయనాలు శరీరంలో వాపు తగ్గేందుకు తోడ్పడతాయి.కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. ముదురు ఎరుపురంగులో ఉండే ఆల్బుకారా పండ్లలో ఈ ఫెనోలిక్ రసాయనాలు మరింత ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ పండ్లనూ వీలైనప్పుడల్లా తినటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.ఆల్బుకారా. రోగాలన్నింటినీ తగ్గిస్తుందని నమ్మకాన్నిచ్చే పండు. దీన్ని ఇష్టంగా తినడానికి చెప్పుకునే కారణాలు చాలా కనిపిస్తున్నాయి. నేడు బజార్లో కూడా అంతే కన్నులకింపుగా కనిపిస్తున్నారు. ప్రూన్స్, డ్రూప్స్, ప్లమ్. ఎలా పిలుచుకున్నా అభ్యంతరం చెప్పని ఈ పళ్లు బ్లూ- బ్లాక్, పసుపు, పర్పుల్, ఎరుపు రంగులలో దొరుకుతాయి.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







