ప్రభుత్వ వైద్యానికే ప్రాధాన్యం...
- February 25, 2016
బడ్జెట్‌లో ప్రజాప్రయోజనాలకే పెద్దపీట-ఆర్నెళ్లలో మారనున్న దవాఖానల రూపురేఖలు -వైద్యసదుపాయాలకు తగినన్ని కేటాయింపులు -వైద్యశాఖ అధికారులతో సమీక్షలో సీఎం కేసీఆర్ -845 వైద్యుల పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్! హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మానవ వనరుల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్‌కు రూపకల్పన జరుగుతున్నది. ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించడానికి బడ్జెట్‌పై భారీ కసరత్తు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా ఒక్కో రంగానికి ఎంత కేటాయించాలో క్యాలిక్యులేటర్‌లో లెక్కలు వేస్తున్నారు. ఇటీవల అధికారులతో జరిగిన చర్చల్లో బడ్జెట్ ఎంతఅనేది కాదు.. ఆరునెలల్లో దవాఖానల్లో గుణాత్మకమైన మా ర్పులు రావాలని సూచించారు.దవాఖానల్లో పడకలు, నిర్వహణ, వైద్యులు, సిబ్బంది, ఇలా ప్రతి అంశంపై లోతుగా చర్చించారు. ప్రజలకు ఆరోగ్యపరమైన ధీమా ఇస్తేనే సమా జం ముందుకుపోతుందని సీఎం కేసీఆర్ తలచారు. ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స చేయించుకునే స్తోమతలేని సామాన్య, మధ్యతరగతి ప్రజలంతా సర్కారు దవాఖానలకు వెళ్లేదిశగా చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలో ప్రజలు పెద్దఎత్తున ప్రభుత్వ దవఖానల్లో వైద్యసేవల కోసం వెళ్తారని, రాష్ట్రంలోనూ అదే పరిస్థితి రావాలని సీఎం కేసీఆర్ కోరుకుంటున్నారు. వైద్యరంగంలో ఆరు నెలల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపించాలని అధికారులను ఆదేశించారు. దవాఖానలకు భవనాలు నిర్మించి వదిలేస్తే అవి ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయని అధికారులను ప్రశ్నించారు. నిర్వహణ ఖర్చులు ఎంతకావాలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అధికారులతో చెప్పిన అంకెల ఆధారంగా క్యాలిక్యులేటర్‌పై సీఎం కేసీఆర్ లెక్కలు వేశారు. ఇంతలోతుగా బడ్జెట్‌పై చర్చించిన ముఖ్యమంత్రిని ఇంతవరకు చూడ లేదని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ప్రతి రూపాయి ప్రజలకు ఏవిధంగా ఉపయోగపడుతుందనే పరిశీలనతోనే చర్చించారని చెప్పారు. ఆరోగ్యశ్రీ సేవలు 70 శాతం ప్రైవేట్ దవాఖానల్లో అందుతున్నాయని, 30 శాతమే ప్రభుత్వ దవాఖానల్లో అందుతున్నాయని సీఎం కేసీఆర్ లెక్కలు చూపించారు. మూడు నెలల్లో ఆరోగ్యశ్రీ సేవలు 70 శాతం ప్రభుత్వ దవాఖానల్లో అందాలని, ఆ దిశగా దవాఖానల నవీకరణ జరగాలన్నారు. కావాల్సిన చర్యలను యుద్ధప్రాతిపదిక చేపట్టాలని, నిధులు వెంటనే విడుదల చేస్తామని అధికారులకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. 845 వైద్యుల పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.-వైద్యశాఖ డైరెక్టర్లకు రూ.2కోట్ల వరకు మంజూరు అధికారంవైద్యశాఖలో అత్యవసర పనులకు ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఒక్కో డైరెక్టర్‌కు రూ.2 కోట్ల వరకు మంజూరు చేసే అధికారం కల్పించారు. ప్రతి దవాఖానకు చిన్నచిన్న మరమ్మతులకు కంటింజెన్సీఫండ్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. బోధనా వైద్యశాలలకు రూ.కోటి, జిల్లా దవాఖానలకు రూ.25 లక్షలు, ఏరియా దవాఖానకు రూ.10 లక్షలు, ప్రైమరీ హెల్త్ సెంటర్(పీహెచ్‌సీ)కి రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. అన్ని పరీక్షలు దవాఖానల్లోనే: రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో 17,900 పడకలు ఉన్నాయి. ఇవన్నీ మంచి కండీషన్‌లో ఉండాలని, బెడ్‌షీట్లు కూడా బాగుండాలంటే ఎంత ఖర్చవుతుందని అధికారులను సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. పడకలను మార్చడానికి రూ.35 కోట్లు అవసరమని అధికారులు చెప్పగా, వెంటనే నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ఏకైక ప్రభుత్వ క్యాన్సర్ దవాఖాన ఎమ్‌ఎన్‌జేను అధునాతన పద్ధతుల్లో తీర్చిదిద్దాలని నిర్ణయించా రు. 500 పడకల నుంచి వెయ్యి పడకలకు పెంచనున్నట్లు తెలిసింది. 104, 108 సేవలను మెరుగుపరచాలని, వైద్యారోగ్యశాఖకు మరో 150 వాహనాలు కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం కొన్ని చోట్ల రక్త పరీక్షలు కూడా బయట చేయిస్తున్నారు. రక్త పరీక్ష, బీపీ, షుగర్, మూత్రపరీక్ష ఇలా ప్రాథమిక పరీక్షలన్నీ ప్రభుత్వ దవాఖానల్లోనే జరిగేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ప్రతి జిల్లాలో నాలుగు దవాఖానల్లో డయాలసిస్ సెంటర్లు ఏర్పా టు చేయనున్నారు. రోగులకు మందులు కూడా దవాఖానల్లోనే ఇవ్వాలని, బయటకు చీటీలు రాయవద్దని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో 20 బోధనా వైద్యశాలలున్నా యి. వీటిలో వైద్యులే పాలనా బాధ్యతలు చూడడం కష్టమని ప్రభుత్వం భావిస్తున్నది. పాలనా అధికారులను ప్రత్యేకంగా నిమించాలని భావిస్తున్నది. విజయవంతమైతే దశలవారీగా మిగతాచోట్ల అమలు చేయనున్నారు. నిమ్స్‌పై ప్రత్యేక దృష్టి: స్వయంప్రతిపత్తి కలిగిన నిమ్స్‌ను బాగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. 10 ఏండ్ల కిందట నిర్ణయించిన యూజర్‌చార్జీలే ఇక్కడ అమలవుతున్నాయి. ప్రస్తుతం యూజర్ చార్జీల వల్ల దవాఖానకు ఏడాదికి రూ. 100 కోట్ల ఆదాయం వస్తుంది. దవాఖానలో సేవలు మరిం త పెంచేలా యూజర్ చార్జీలను సవరించాలని అధికారులు సీఎం కేసీఆర్‌కు విన్నవించారు. యూజర్‌చార్జీల సవరణపై కసరత్తు చేయాలని అధికారులకు సీఎం సూచించారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







