చెన్నై టెస్టులో ఇంగ్లాండ్ పై భారత్ ఘన విజయం
- February 16, 2021
చెన్నై:నాలుగు టెస్ట్ మ్యాచ్ సిరీస్‌లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది.ఇంగ్లాండ్ పై 317 పరుగుల తేడాతో భారత్ విజయకేతనం ఎగురవేసింది.టీమిండియా స్పిన్నర్ల ధాటికి విలవిలలాడిన ఇంగ్లండ్... రెండో ఇన్నింగ్స్ లో 164 పరుగులకే ఆలౌట్ అయింది.ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాడు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్.ఏకంగా 5 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను ఘోరంగా దెబ్బ తీశాడు అక్షర్ పటేల్. అటు అశ్విన్ రెండు ఇన్నింగ్స్‌లో కలిపి మొత్తం 8 వికెట్లు పడగొట్టాడు. కాగా.. మొదటి ఇన్నింగ్స్‌లో టీం ఇండియా 329 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌట్ అయింది.ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే ఆలౌట్ అయి.. ఓటమి చవి చూసింది.4 టెస్టుల సిరీస్‌లో చెరో మ్యాచ్ గెలిచిన భారత్, ఇంగ్లండ్.. 1-1తో సిరీస్‌ను సమం చేశాయి.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు