యూఏఈ కోవిడ్ వ్యాక్సినేషన్: 40 శాతం మందికి వ్యాక్సిన్

- February 17, 2021 , by Maagulf
యూఏఈ కోవిడ్ వ్యాక్సినేషన్: 40 శాతం మందికి వ్యాక్సిన్

యూఏఈ:యూఏఈ జనాభాలో 40 శాతం మందికి కోవిడ్ వ్యాక్సిన్ అందించినట్లు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.వృద్ధుల్లో దాదాపు 50 శాతం మందికి కోవిడ్ వ్యాక్సిన్ అందినట్లు అథారిటీస్ చెబుతున్నాయి. యూఏఈ హెల్త్ సెక్టార్ అధికార ప్రతినిథి డాక్టర్ ఫరీదా అల్ హోసాని మాట్లాడుతూ 48.6 శాతం వృద్ధులకు వ్యాక్సిన్ అందించినట్లు చెప్పారు.ఇది దేశంలో హెర్డ్ ఇమ్యూనిటీ సాధించడానికి ఉపయోగపడుతుందని అన్నారు.వృద్ధులకు వ్యాక్సిన్ అందించడం ద్వారా కోవిడ్ వల్ల కలిగే తీవ్ర అనారోగ్య సమస్యల్ని తగ్గించడానికి వీలవుతుంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 16 నాటికి దేశంలో 5.19 మిలియన్ వ్యాక్సిన్ డోసుల్ని అందించినట్లు తెలుస్తోంది. ప్రతి 100 మందిలో 52.56 మందికి వ్యాక్సిన్ అందించినట్లయ్యింది. తొలి డోసు అందుకున్నవారందరికీ రెండో డోస్ కూడా అందిస్తున్నట్లు పేర్కొన్నాయి అథారిటీస్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com