స్కూళ్ళలో ఇన్‌ఫెక్షన్ రేటు స్వల్పమే

- February 17, 2021 , by Maagulf
స్కూళ్ళలో ఇన్‌ఫెక్షన్ రేటు స్వల్పమే

దోహా:మినస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అడ్వయిజర్ మొహమ్మద్ బాస్రి మాట్లాడుతూ, స్కూళ్ళలో కోవిడ్ 19 ఇన్‌ఫెక్షన్ రేటు 1 శాతం కంటే తక్కువగా వుందనీ, ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ టీచింగ్ మోడ్ మాత్రమే పెట్టాల్సిన అవసరం లేదని అన్నారు.ఇన్‌ఫెక్షన్ రేటు గనుక 5 శాతం దాటితే, అప్పుడు స్కూళ్ళలో ప్రత్యక్ష విద్యను నిలిపివేయడంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా స్కూళ్ళలో ఆ కొద్ది కేసులూ వస్తున్నాయనీ, మరింత పకడ్బందీగా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడితే, ఆ కేసులు కూడా వుండవని వివరించారాయన.స్కూళ్ళలో సరైన నిబంధనలు పాటించని పక్షంలో కఠిన చర్యలు తీసుకునే దిశగా ఎప్పటికప్పుడు అథారిటీస్ తనిఖీలు నిర్వహించడం జరుగుతోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com