ఆర్థిక భరోసానిచ్చే పాలసీ..
- February 17, 2021
ప్రభుత్వ సంస్థ ప్రముఖ బీమా సంస్థ ఎల్ఐసీ..ఇది అత్యంత విశ్వసనీయ సంస్థ. అధిక సంఖ్యలో ప్రజలు పెట్టుబడి పెట్టడానికి ఇదే ప్రధాన కారణం. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పాలసీలను తీసుకువస్తూ ప్రజల ప్రయోజనార్థం పని చేస్తుంటుంది.ఈ సంస్థ తీసుకొచ్చిన పాలసీలలో జీవన్ ఆనంద్ పాలసీకి మంచి ప్రాచుర్యం లభించింది. పాలసీ గడువు ముగిసిన తరువాత కూడా బీమా కొనసాగడం ఈ పాలసీ ప్రత్యేకత. దీనిలో కొన్ని మార్పులు, చేర్పులు చేసి కొత్తగా ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ పాలసీ అని ఒకటి తీసుకువచ్చింది ఎల్ఐసీ కొద్దినెలల క్రితం.
ఇక ఇందులో చేరేందుకు కనీస వయస్సు 18 నుంచి 50 ఏళ్లు ఉండాలి.కనీస బీమా లక్ష అంతకు మించి ఎంతైనా గరిష్ట పరిమితి లేదు.కాలపరిమితి 15 నుంచి 35 ఏళ్ల కాలం. ఉదాహరణకు పాలసీ దారుడు 35 ఏళ్ల వయసులో 5 లక్షలు పెట్టుబడి పెట్టి ఈ పాలసీ తీసుకున్నాడని అనుకుందాం.అప్పుడు అతడు నెలకు రూ.1650లు (అంటే రోజుకు రూ.55)చెల్లిస్తే సరిపోతుంది. మూడు నెలలకు ఒకసారి కట్టాలి అనుకుంటే రూ.5000, అదే ఆరు నెలలకు కట్టాలనుకుంటే రూ.10000 చెల్లించాల్సి ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి కడతానంటే కూడా ఒకేసారి రూ.20000 చెల్లించొచ్చు. ఒకవేళ పాలసీ దారుడు గడువులోపే మరణిస్తే అప్పుడు నామినీకి రూ.5,00,000 లక్షలు చెల్లిస్తారు. ఈ విధంగా మొత్తం 25 సంవత్సరాలు పెట్టుబడి పెట్టిన తరువాత పాలసీదారునికి ఎస్ఐ రూపంలో రూ.5,00,000, బోనస్ కింద రూ.5,75000, చివరిగా అదనపు బోనస్ కింద రూ.2,25,000 లభిస్తాయి. ఈ విధంగా 60 ఏళ్ల వయసు వచ్చేసరికి పాలసీ దారునికి 1300000 అందుకున్నట్లవుతుంది.
మరిన్ని వివరాలకు ఈ నెంబర్ 00919949322175 కి కాల్ చెయ్యగలరు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







