భారత్ టూ దుబాయ్ ప్రయాణికులకు పీసీఆర్ టెస్ట్ కొత్త రూల్స్
- February 18, 2021
భారత్ నుంచి దుబాయ్ వెళ్లే ప్రయాణికులు ఇన్నాళ్లుగా పీసీఆర్ టెస్ట్ నిబంధనల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.ఇక నుంచి పీసీఆర్ టెస్ట్ ఒరిజినల్ రిపోర్ట్ యాక్సెస్ ఉండేలా క్యూఆర్ కోడ్ లింకింగ్ విధానాన్ని అమలులోకి తీసుకురానున్నారు. దీనికి సంబంధించి ఇండియన్ క్యారియర్ ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ పీసీఆర్ టెస్ట్ రూల్స్ ను మారుస్తున్నట్లు ప్రకటించింది. క్యూఆర్ కోడ్ లింకింగ్ తో పాటు శాంపిల్స్ ఏ రోజు..ఏ సమయంలో ఇచ్చారు, రిపోర్టులు ఏ రోజు..ఏ సమయానికి వచ్చాయో కూడా స్పష్టం చేయాల్సి ఉంటుంది.దుబాయ్ ఆరోగ్య శాఖ నుంచి అందిన సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.ల్యాబోరేటరీల నుంచి ఫేక్ పీసీఆర్ టెస్ట్ రిపోర్టులతో ప్రయాణాలు చేస్తున్నారనే సందేహాలు వ్యక్తం చేసిన దుబాయ్ క్యూఆర్ కోడ్ విధానాన్ని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.అయితే..ఈ కొత్త పీసీఆర్ టెస్ట్ రూల్స్ ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయో మాత్రం ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ స్పష్టంగా పేర్కొలేదు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







