బహ్రెయిన్‌ లో నల్గురు తీవ్రవాదులకు అయిదేళ్ళ జైలుశిక్ష

- February 26, 2016 , by Maagulf
బహ్రెయిన్‌ లో నల్గురు తీవ్రవాదులకు అయిదేళ్ళ జైలుశిక్ష

 తిన్నఇంటికే వాసాలు లెక్కపెట్టినట్లు ...ఉన్న స్వంత దేశం లోనే ఉగ్రవాద చర్యలకు పాల్పడబోయారా నల్గురు ముష్కరులు కాని వారి ఆటలు సాగ నియ్యలేదు బహెరిన్ న్యాయస్థానం... వివరాలలోనికి వెళితే  గల్ఫ్, అరబ్ రాజ్యంలో దాడులు నిర్వహించి పలుచోట్ల పేలుళ్లను జరిపించి అందుకు కావాల్సిన ఆయుధాల  శిక్షణను పరాయి దేశంలో పొందిన బహెరిన్ కు చెందిన నల్గురు తీవ్రవాదులకు అయిదేళ్ళ జైలుశిక్ష బహెరిన్ కోర్టు విధించినట్లు పబ్లిక్ ప్రాసిక్యుషన గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. బహెరిన్  జాతీయ వార్తా సంస్థ ( బి యెన్ ఎ ) తెలిపిన సమాచారం ప్రకారం కొందరు బెహేరనీయులు ఇరాక్ కు రహస్యంగా పారిపోయి తీవ్రవాద శిక్షణ శిబిరాలలో చేరుతున్నారని తెలిపింది. వీరికి ఎర వేసిన ఇతర జాతీయులు బాగా ప్రేరేపించి బహెరిన్ లో ఉగ్రవాద చర్యలకు పాల్పడాలని ఆదేశించి తిరిగి వారి స్వదేశానికి పంపుతున్నట్లు తెలిపింది. కాగా పట్టుబడిన నలుగురు తీవ్రవాదుల్లో ఇద్దరు మార్గ సూచీని , ప్రయాణ ప్రణాళికను రూపొందిస్తారని...మరో ఇద్దరు బహెరిన్ రాజ్యంలో పేలుళ్లను కల్గించి ప్ర్రాణ, ఆస్తి నష్టం కల్గించడానికి సిద్ధపడినట్లు బహెరిన్ జాతీయ వార్తా సంస్థ ( బి యెన్ ఎ ) తెలిపింది. ఇంట్లో తయారుచేసే విధంగా పేలుడు పదార్ధాలను ఉపయోగించి గత రెండేళ్లుగా ఇరాక్ కు చెందిన షియా లెబనీస్ మిలిటెంట్ బృందం, హేజ్ బొల్లాహ్ ఆర్ధిక సహకారంతో  బహెరిన్ లో  ఉగ్రవాద చర్యలకు ప్రేరేపిస్తున్నట్లు తెలిపింది. 

 


   
                 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com