నిషేధిత దేశాల లిస్టులో మార్పులకు అవకాశం
- February 19, 2021
కువైట్ : డైరెక్ట్ ఎంట్రీకి సంబంధించి కొన్ని దేశాల పేర్లను నిషేధిత జాబితాలో కువైట్ డిజిసిఎ చేర్చిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా విడుదల చేసిన తప్పనిసరి క్వారంటైన్ నిబంధనల నేపథ్యంలో నిషేధిత దేశాల జాబితాలో మార్పులు చేర్పులు వుండొచ్చని తెలుస్తోంది. నిషేధిత జాబితా నుంచి హై రిస్క్ దేశాలుగా మార్పు చేసి, తగిన రీతిలో నిబంధనలు చేర్చే అవకాశం వుందని సమాచారం. సంబంధిత వర్గాల నుంచి ఈ మేరకు సమాచారం అందుతోంది. ఫిబ్రవరి 21 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాల్సి వుంటుందనీ, అయితే.. నిషేధిత జాబితా సహా పలు అంశాలపై కొంత గందరగోళం నేపథ్యంలో త్వరలోనే దీనిపై స్పష్టత రానుందనీ ఆ వర్గాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …