పుదుచ్చేరి నుండి టి.గవర్నర్ సమీక్ష

- February 19, 2021 , by Maagulf
పుదుచ్చేరి నుండి టి.గవర్నర్ సమీక్ష

పుదుచ్చేరి:పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు స్వీకరించిన రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ ఈరోజు పుదుచ్చేరి నుండి తెలంగాణ రాష్ట్ర అంశాలపై సమీక్ష నిర్వహించారు. 

పుదుచ్చేరి రాజ్ నివాస్ నుండి గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైదరాబాద్ రాజ్ భవన్ అధికారులతో తెలంగాణ రాష్ట్ర అంశాలకు సంబంధించిన వివిధ విషయాలపై సమగ్రంగా సమీక్ష చేశారు. 


“నేను పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు స్వీకరించినప్పటికీ, తెలంగాణకు సంబంధించిన విషయాలపై, ఇతర డెవలప్ మెంట్స్ పై నేను తెలుసుకుంటూనే ఉన్నాను”.
“తెలంగాణ ప్రజల సంక్షేమం, బాగోగులు నాకు అత్యంత ప్రాధాన్యత. నేను పుదుచ్చేరిలో ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం పట్ల అణుక్షణం నా తపన అలానే ఉంది”. 
“నేను మీకు (రాజ్ భవన్, హైదరాబాద్ అధికారులకు) ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటాను. అవసరమైన విషయాలు నా దృష్టికి తీసుకురండి” అని సూచించారు. 
తెలంగాణ రాష్ట్రం, ప్రజలకు సంబంధించిన విషయాలు నాకు అత్యంత ప్రాధాన్యం అని డా. తమిళిసై సౌందరరాజన్ వివరించారు. 
సెక్రటరి టు గవర్నర్ కె. సురేంద్ర మోహన్ పుదుచ్చేరి నుండి గవర్నర్ తో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. హైదరాబాద్ రాజ్ భవన్ నుండి గవర్నర్ సలహాదారులు, జాయింట్ సెక్రటరీలు, ఇతర అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. 
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com