దుబాయ్ ఫిలిం ఫెస్టివల్లో మహిళల సమస్యలపై దృష్టి
- February 26, 2016
వచ్చే నెలలో జరగనున్న దుబాయ్ ఫిలిం ఫెస్టివల్లో మహిళలపై హింసపై చర్చా కార్యక్రమాలు జరగనున్నాయి. వరల్డ్ ఆఫ్ విమెన్ ఫిలిం ఫెయిర్ మార్చ్ 5న ప్రారంభం కానుంది. మార్చ్ 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం. వరల్డ్ ఆఫ్ విమెన్ ఫౌండర్ హెర్మోయిన్ మకురా మాట్లాడుతూ, మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సంబంధించిన చర్చలపై చర్చ జరగాలని అన్నారు. మహిళల సమస్యలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరగాల్సి ఉందనీ, ఈ ఏడాది ముఖ్యమైన అంశాలు చర్చకు వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారామె. హ్యూమన్ ట్రాఫికింగ్, అలాగే మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్ళపైనా ఫోకస్ పెరగాల్సిన అవసరం ఉందన్నారు. వైవాహిక జీవితానికి ముందు, తర్వాత కూడా మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు మకురా. ఫౌండేషన్ జనరల్ సెక్రెటరీ అఫ్రా అల్ బస్తి మాట్లాడుతూ, యూఏఈ ఈ అంశాల్ని చాలా సీరియస్‌గా తీసుకుందని అన్నారు. ఈ విభాగంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. బ్రిటిష్ లాయర్ ఖతిజా సక్రైన్ మాట్లాడుతూ, గృహ హింస, అవమానం ప్రపంచ వ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య అని అన్నారు. ఇరాక్‌లో జఫారి చట్టం బాల్య వివాహాల్ని చట్టబద్ధం చేయడం దారుణమని వక్తలు అభిప్రాయం వెలిబుచ్చారు. మూడు రోజుల ఫిలిం ఫెస్టివల్ మార్చ్ 8 వరకు సాగుతుంది.
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







