స్లైసింగ్ మెషిన్ తో గోళ్లను శుభ్రం చేసుకున్న వర్కర్..పండ్ల షాపు సీజ్

- February 20, 2021 , by Maagulf
స్లైసింగ్ మెషిన్ తో గోళ్లను శుభ్రం చేసుకున్న వర్కర్..పండ్ల షాపు సీజ్

ఫుజైరా:పండ్లు, కూరగాయలను కోయడానికి ఉపయోగించే స్లైసింగ్ మెషిన్ తో గోళ్లను శుభ్రం చేసుకున్నాడు ఓ కార్మికుడు. అతని బాగోతాన్ని కాస్త వీడియో తీసిన వినియోగదారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియో వైరల్ కావటంతో ఏకంగా ఆ పండ్లు, కూరగాయల షాప్ సీజ్ అయ్యింది. యూఏఈలోని ఫుజైరాలో ఈ ఘటన చోటు చేసుకుంది.అసలే కరోనా సమయం..గ్లౌజులు ధరించిగానీ కూరగాయలు, పండ్లు ముట్టుకోవటం కూడా మంచిది కాదు. కానీ, ఫుజైరాలోని ఓ పండ్లు, కూరగాయల షాపులో పని చేసే వ్యక్తి ఏకంగా స్లైసింగ్ మెషిన్ తో తన గోర్లను శుభ్రం చేసుకున్నాడు. అది చూసిన వినియోగదారులు అతని నిర్లక్ష్యాన్ని వెంటనే వీడియో తీశారు.వీడియో వైరల్ కావటంతో ఫుజైరా మున్సిపాలిటీ బృందం పండ్లు, కూరగాయల షాపులో తనిఖీలు నిర్వహించి విచారణ చేపట్టింది.ఆహార పరిశుభ్రత నిబంధనలను ఉల్లంఘించినట్లు రుజువు కావటంతో షాపును మూసివేసింది. అహార భద్రతకు సంబంధించి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే సహించబోమని హెచ్చరించింది. అహార శుభ్రత నియమాలను ఉల్లంఘించినట్లు గమనిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు అధికారులు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com