పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఏ.పి డీ.జీ.పి గౌతమ్ సవాంగ్

- February 20, 2021 , by Maagulf
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఏ.పి డీ.జీ.పి గౌతమ్ సవాంగ్

ఏ.పి:ఈ రోజు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర డీ.జీ.పి.,గౌతమ్ సవాంగ్ ., శ్రీకాకుళం జిల్లాలో సందర్శించి ఎచ్చెర్ల మండలంలోని ఎచ్చెర్ల గ్రామంలో ఎం.పి.యూ.పి., పాఠశాలలొ గల పోలింగ్ కేంద్రంను పర్యవేక్షించి క్షేత్రస్థాయిలో పోలింగ్ కేంద్రం వద్ద భద్రత ఏర్పాట్లను పరిశీలించి, ఎన్నికల విధుల్లో ఉన్న పోలింగ్ అధికారులు మరియు సిబ్బందితో మాట్లాడి పలు దిశ నిర్దేశాలు చేశాను. అనంతరం ఎచ్చెర్ల ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు మైదానంలో పోలీస్ కమ్యూనిటీ హాల్ నందు జిల్లా అధికారులుతో 2021 గ్రామ పంచాయతీ ఎన్నికలుపై సమీక్ష సమావేశం నిర్వహించి పలు కీలక అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా డీ.జీ.పీ., మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛాయుతగా మరియు సజావుగా జరిగాయి అని కొనియాడారు.

అనంతరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన,ఎన్నికల సమయంలో సామజిక దృక్పథంతో వృద్ధులు, వికలాంగులుకు ఓటు వేసేందుకు చేయూత అందించిన పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి మరియు గ్రామ మహిళా కార్యదర్శిలకు ప్రశంసాపత్రాన్ని అందించి ప్రత్యేక అభినందనలు తెలియజేసినారు.డీజీపీ తో విశాఖపట్నం రేంజి డి.ఐ.జి., ఎల్.కె.వి., రంగరావు , జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్  మరియు జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆయా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com