పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఏ.పి డీ.జీ.పి గౌతమ్ సవాంగ్
- February 20, 2021
ఏ.పి:ఈ రోజు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర డీ.జీ.పి.,గౌతమ్ సవాంగ్ ., శ్రీకాకుళం జిల్లాలో సందర్శించి ఎచ్చెర్ల మండలంలోని ఎచ్చెర్ల గ్రామంలో ఎం.పి.యూ.పి., పాఠశాలలొ గల పోలింగ్ కేంద్రంను పర్యవేక్షించి క్షేత్రస్థాయిలో పోలింగ్ కేంద్రం వద్ద భద్రత ఏర్పాట్లను పరిశీలించి, ఎన్నికల విధుల్లో ఉన్న పోలింగ్ అధికారులు మరియు సిబ్బందితో మాట్లాడి పలు దిశ నిర్దేశాలు చేశాను. అనంతరం ఎచ్చెర్ల ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు మైదానంలో పోలీస్ కమ్యూనిటీ హాల్ నందు జిల్లా అధికారులుతో 2021 గ్రామ పంచాయతీ ఎన్నికలుపై సమీక్ష సమావేశం నిర్వహించి పలు కీలక అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా డీ.జీ.పీ., మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛాయుతగా మరియు సజావుగా జరిగాయి అని కొనియాడారు.
అనంతరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన,ఎన్నికల సమయంలో సామజిక దృక్పథంతో వృద్ధులు, వికలాంగులుకు ఓటు వేసేందుకు చేయూత అందించిన పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి మరియు గ్రామ మహిళా కార్యదర్శిలకు ప్రశంసాపత్రాన్ని అందించి ప్రత్యేక అభినందనలు తెలియజేసినారు.డీజీపీ తో విశాఖపట్నం రేంజి డి.ఐ.జి., ఎల్.కె.వి., రంగరావు , జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ మరియు జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆయా కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం