కువైట్‌లో ప్రస్తుతానికి కర్ఫ్యూ లేదు

కువైట్‌లో ప్రస్తుతానికి కర్ఫ్యూ లేదు

కువైట్ సిటీ:కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రస్తుతం దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో పాక్షిక లాక్‌డౌన్ సహా అనేక అంశాల గురించి చర్చించడం జరిగింది. అయితే, ప్రస్తుతం లాక్‌డౌన్ విధించే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఎప్పటికప్పుడు కరోనాకి సంబంధించిన డేటా విశ్లేషించడం జరుగుతోందనీ, తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని అథారిటీస్ చెబుతున్నాయి. మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం వంటి చర్యల ద్వారా కరోనా వ్యాప్తిని అడ్డుకట్ట వేయొచ్చన్నది అథారిటీస్ చెబుతున్న మాట. హెల్త్ రెగ్యులేషన్స్ విషయంలో ఇంకోసారి సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.

Back to Top