హిందీలో రీమేక్ కానున్న ఉప్పెన!
- February 23, 2021బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన 'ఉప్పెన' చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కురిపిస్తుంది. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందించారు. తొలి ప్రయత్నంలోనే దర్శకుడు, హీరో, హీరోయిన్ సక్సెస్ అవ్వడం పట్ల టాలీవుడ్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ సక్సెస్ ను రెండు తెలుగు రాష్ట్రాలంతటా ఎంజాయ్ చేస్తున్నారు చిత్రబృందం. కాగా ఈ సినిమా తమిళ రీమేక్ లో విజయ్ తనయుడు సంజయ్ రీమేక్ చేయనున్నాడని ఇటీవల కోలీవుడ్ లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే, ఇప్పుడు తాజాగా హిందీలోను రీమేక్ కానున్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్లో ఇషాన్ ఖట్టర్, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా 'ఉప్పెన' రీమేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..